Tata Nano
-
వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది
రతన్ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్‌గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకసారి రతన్‌టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. -
రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?
Ratan Tata Dream Car: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి 'రతన్ టాటా' (Ratan Tata) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన కలలు కారుగా ప్రసిద్ధి చెందిన 'టాటా నానో' (Tata Nano) గత కొంతకాలంగా దేశీయ విఫణిలో ఉత్పత్తికి నోచుకోలేదు. అయితే ఇది మళ్ళీ ఇండియన్ మార్కెట్లో కొత్త హంగులతో విడుదలవుతుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నానో ఎలక్ట్రిక్ కారు.. నివేదికల ప్రకారం, టాటా కంపెనీ తన ఐకానిక్ కారు నానో గురించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా అడుగెట్టే అవకాశం ఉంది. ప్రతి భారతీయుడు కారు కలిగి ఉండాలనే అభిప్రాయంతో రతన్ టాటా దీనికి ఊపిరి పోశారు. ఇప్పటి వరకు కూడా మనదేశంలో అతి తక్కువ ధరకు లభించే కారు టాటా నానో. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ప్రారంభంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు క్రమంగా అమ్మకాల విషయంలో వెనుకపడిపోయింది. అయితే దీనిని ఎస్ఆర్కే (SRK) డిజైన్స్ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారుగా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది పట్టణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ టాటా నానో ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఏంటి అనే అధికారిక సమాచారం రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
ఇదేమి సిత్రం! టాటా నానో దెబ్బకు మహీంద్రా థార్ బోల్తా
సాక్షి,ముంబై: టాటా నానో అండ్ మహీంద్రా థార్ రెండూ ఢీ కొట్టుకుంటే ఏది గెలుస్తుందని అడిగితే అందరూ థార్ గెలుస్తుందని ముక్తకంఠంతో చెబుతారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటనలో నానో దెబ్బకు మహీంద్రా థార్ బోల్తా పడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో మహీంద్రా థార్ పూర్తిగా బోల్తా పడి ఎక్కువ డ్యామేజీకి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితేచిత్రం ఏమిటంటే ఇందులో టాటా నానోకి పెద్దగా ప్రమాదం జరగలేదు, కేవలం ఫ్రంట్ బంపర్ మాత్రం కొద్దిగా దెబ్బతినింది. ఈ సంఘటన థార్ యజమానుల గుండెల్లో గుబులు రేపుతోందట. నిజానికి మహీంద్రా థార్ అధిక వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో టాటా నానో ఢీ కొట్టినట్లు సామజిక వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు, కానీ నానో కారు ఢీ కొడితే థార్ ఎలా బోల్తా పడింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఉత్తమ సేఫ్టీ రేటింగ్ పొందిన మహీంద్రా థార్ ఇప్పటికి కూడా దేశీయ మార్కెట్లో అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందుతున్న SUVలలో ఒకటిగా ఉంది. అదే సమయంలో క్రాష్ టెస్ట్‌లో నానో సున్నా స్టార్ రేటింగ్ మాత్రమే పొందడం గమనార్హం. మహీంద్రా థార్ అధిక వేగం కారణంగానే బోల్తా పది ఉండవచ్చు, లేదా ఇతర కారణాలు ఉండవచ్చు. ఈ సంఘటన వల్ల థార్ ప్రియులు ఏ మాత్రం దిగులుపడాల్సిన అవసరం లేదు. ఈ SUV లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. -
మార్కెట్లోకి టాటా నానో ఈవీ..?
-
సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?
సాక్షి ముంబై: దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నానో కారును మళ్లీ తీసుకొస్తోందా? ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కలల కారు, ప్రపంచంలోనే అత్యంత చౌక కారు నానో ఈవీని టాటా గ్రూప్ లాంచ్ చేయనుందని అంచనాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి. టాటా మోటార్స్ నానో ప్రాజెక్ట్‌ను తిరిగి పునరుజ్జీవింపజేస్తోందని తాజా మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. నానో ఈవీని తీరిగి తీసుకురావాలనే ప్రణాళికలు ఫలవంతమైతే, ఫోర్డ్ మరైమలైనగర్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి టాటా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలను పునః ప్రారంభించవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అమ్మకాలు లేక 2019 నుంచి నానో కారు తయారీని నిలిపి వేసింది. దేశంలో అందరికీ కారు అనే నినాదంతో 2008లో కేవలం లక్ష రూపాయలకే అందుబాటులోకితీసుకొచ్చిన నానోను ఎలక్ట్రిక్ మోడల్ లాంచింగ్‌కు ప్లాన్ చేస్తోందట టాటా. అయితే ఈవార్తలపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా టాటా మోటార్స్ 80శాతానికి పైగా మార్కెట్ వాటాతో ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం టాటా నెక్సాన్, టిగోర్, టియాగో లాంటి ఈవీలను అందిస్తోంది. ఈవీ సెగ్మెంట్లో ఆధిక్యాన్ని కొనసాగించడానికి, సమీప భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో పది ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని ప్లాన్. ఇప్పటికే కర్వ్, అవిన్యా లాంటి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. -
టాటా 'నానో' కథ ముగిసినట్టేనా?
రతన్ టాటా తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న కారు 'నానో'. కానీ ఆ కారు మాత్రం రతన్ టాటా కలలను అందుకోలేకపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ఆటో ఇండస్ట్రీలోకి వచ్చి సంచలనాలు సృష్టించిన నానో, మూత పడే దిశకు వస్తోంది. మార్చి నెలలో ఈ కారు అమ్మకాలు కేవలం 174 యూనిట్లే అమ్ముడుపోయాయి. అంతేకాక, ఈ వెహికిల్ ప్లాట్ ఫామ్స్ ను కూడా కంపెనీ తగ్గించేస్తుందట. కానీ రతన్ టాటా మానసపుత్రిక తర్వాతి పరిస్థితేమిటంటే కంపెనీ అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు. టాటా మోటార్స్ కు సప్లయిర్స్ గా ఉన్న ఎగ్జిక్యూటివ్ లు మాత్రం నానో తమ చర్చల్లో భాగం కాదని తేల్చేస్తున్నారు. దీంతో నానో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని తెలుస్తోంది. ''టాటా మోటార్స్ సైతం నానో ప్రాజెక్ట్ పై ఇప్పడి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సహజంగానే ఈ కారు ప్రస్తావన ముగిసిపోయేలా చేయాలని వారు ఆలోచిస్తున్నారు'' అని నానో కారు పార్ట్స్ తయారుచేసే కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. టియాగో వంటి కొత్త ప్లాట్ ఫామ్స్ పైనే మేనేజ్ మెంట్ ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కస్టమర్ డిమాండ్ బట్టి నానో కారును ఉత్పత్తి చేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నానో కార్ల ఉత్పత్తి 64 శాతానికి పడిపోయి, కేవలం 7589 యూనిట్ల ప్రొడ్యూస్ చేశారు. గతేడాది టాటా గ్రూప్ లో నెలకొన్న వివాదంలో ఈ కారు ప్రస్తావనను మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రతన్ టాటా తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న నానో కారు కంపెనీకి గుదిబండగా తయారైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నానో వల్లే కంపెనీలోని ఇతర సంస్థలపై ప్రభావం పడిందని, లాభార్జించలేకపోతున్నామని విమర్శించారు. -
సింగూరు భూములు వాపస్
పట్టాలు, చెక్కులు పంపిణీ చేసిన సీఎం మమత సింగూరు: పశ్చిమబెంగాల్లోని సింగూరులో టాటా నానో కారు ప్లాంటు కోసం పదేళ్ల కిందట సేకరించిన భూమిని సీఎం మమతాబెనర్జీ బుధవారంఆయా భూముల రైతులకు తిరిగి అప్పగించారు. పట్టాలు, పరిహారానికి సంబంధించిన చెక్కలను బుధవారమిక్కడ పంపిణీ చేశారు. అదే సమయంలో.. రాష్ట్రంలో ఆటోమొబైల్ ప్లాంటు స్థాపించాలనుకున్న ఏ సంస్థనైనా ఆహ్వానిస్తామంటూ పరోక్షంగా టాటా పరిశ్రమకు సందేశమిచ్చారు. 2006లో టాటా నానో ప్రాజెక్టు కోసం అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం జరిపిన భూసేకరణపై రైతుల ఆందోళనకు మమత సారథ్యం వహించడం తెలిసిందే. ఆ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందని, అది ప్రజోపయోగం కోసం జరిపిన భూసేకరణ కాదని, యజమానులకు 12 వారాల్లోగా తిరిగి అప్పగించాలని సుప్రీంకోర్టు గత ఆగస్టులో తీర్పివ్వడం విదితమే. మమత.. 9,117 మంది రైతులకు పట్టాలు, 806 మందికి పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. భూమిని తిరిగి ఇస్తానన్న తన హామీని అమలు చేయటం పట్ల సంతోషంగా ఉందన్నారు. అలాగే.. ఇప్పటివరకూ నిరుపయోగంగా ఉన్న భూమిని తిరిగి సాగులోకి తెచ్చుకోవటం కోసం రైతులకు రూ. 10,000 చొప్పున నగదూ ఇస్తామన్నారు. అదే సమయంలో.. ‘మాకు పరిశ్రమలు కావాలి. కానీ బలవంతపు భూసేకరణ ద్వారా కాదు’ అని పేర్కొన్నారు. ‘మీరు ఆలోచించండి. గోల్తోర్(మిడ్నాపూర్ జిల్లాలో) 1,000 ఎకరాలు ఇస్తాం. టాటాలు లేదా బీఎండబ్ల్యూ ఎవరైనా ఆటో పరిశ్రమ స్థాపించాలనుకుంటే.. స్వాగతం’ అని అన్నారు. భూమి మళ్లీ తమకు సొంతం కావడంతో సింగూరు రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం నుంచి పట్టాలు అందుకున్న రైతులు నృత్యం చేశారు. -
12వారాల్లో ఆ రైతులకు భూములు వాపస్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో పెనురాజకీయ దుమారం సృష్టించిన టాటా నానో ఫ్యాక్టరీకి భూముల కేటాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సింగూర్‌లో నానో ఫ్యాక్టరీకి వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాన్ని కొట్టివేసింది. భూములు కోల్పోయిన బాధిత రైతులకు 12వారాల్లోగా వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. 2006లో బెంగాల్‌లోని అప్పటి వామపక్ష ప్రభుత్వం టాటా మోటార్స్‌కు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, వ్యవసాయ భూములను కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అయిన లెఫ్ట్ సర్కార్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మమతా బెనర్జీ అధికార పీఠాన్ని చేపట్టి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నానో ప్లాంటు బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలిపోయింది. తీర్పు సందర్భంగా అప్పటి లెఫ్ట్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంలో లోపాల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించింది. కచ్చితంగా రాష్ట్రంలోకి ఈ ప్రాజెక్టు రావాలని లెఫ్ట్ ప్రభుత్వం మంకుపట్టు పట్టినట్టు కనిపిస్తున్నదని, ప్రైవేటు కంపెనీ సూచన మేరకు నచ్చినచోట భూముల సేకరణ చేపట్టడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో సింగూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వీధుల్లో పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకొన్నారు. -
గంటకు రూ.99 అద్దెతో టాటా నానో కారు
న్యూఢిల్లీ: టాటా నానో ట్విస్ట్ కారు గంటకు రూ.99 చొప్పున అద్దెకు లభించనుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు పరిమితమైనప్పటికీ, త్వరలో దేశమంతటా విస్తరిస్తామని కార్జ్ఆన్రెంట్ సంస్థ తెలిపింది. మైల్స్ సిటీ డ్రైవ్ కార్యక్రమం కింద వినియోగదారులు టాటా నానో ట్విస్ట్ కారును గంటకు రూ99 లేదా రోజుకు రూ.399 చొప్పున లేదా నెలకు రూ.6,999 చెల్లించి అద్దెకు తీసుకోవచ్చని కార్జ్ఆన్రెంట్ పేర్కొంది. ఈ మేరకు 200 నానో కార్ల సరఫరా నిమిత్తం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఢిల్లీ/ఎన్సీఆర్ రీజియన్‌లో ఉన్న 43 సెంటర్లలో, లేదా ఆన్లైన్లో అద్దెకు తీసుకోవచ్చని వివరించింది. మైల్స్ సిటీ డ్రైవ్ స్కీమ్‌ను గత ఏడాది 14 కార్లతో ప్రారంభించామని, ప్రస్తుతం 600 కార్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని కార్జ్ఆన్రెంట్ పేర్కొంది. మొత్తం 16 నగరాల్లో మహీంద్రా ఈ20 నుంచి మెర్సిడెస్-బెంజ్ వరకూ కార్లను అద్దెకు ఇస్తున్నామని, త్వరలో దీనిని దేశమంతటా విస్తరిస్తామని వివరించింది.