Ratan Tata Dream Car: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి 'రతన్ టాటా' (Ratan Tata) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన కలలు కారుగా ప్రసిద్ధి చెందిన 'టాటా నానో' (Tata Nano) గత కొంతకాలంగా దేశీయ విఫణిలో ఉత్పత్తికి నోచుకోలేదు. అయితే ఇది మళ్ళీ ఇండియన్ మార్కెట్లో కొత్త హంగులతో విడుదలవుతుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నానో ఎలక్ట్రిక్ కారు..
నివేదికల ప్రకారం, టాటా కంపెనీ తన ఐకానిక్ కారు నానో గురించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా అడుగెట్టే అవకాశం ఉంది. ప్రతి భారతీయుడు కారు కలిగి ఉండాలనే అభిప్రాయంతో రతన్ టాటా దీనికి ఊపిరి పోశారు. ఇప్పటి వరకు కూడా మనదేశంలో అతి తక్కువ ధరకు లభించే కారు టాటా నానో.
(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!)
ప్రారంభంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు క్రమంగా అమ్మకాల విషయంలో వెనుకపడిపోయింది. అయితే దీనిని ఎస్‌ఆర్‌కే (SRK) డిజైన్స్ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారుగా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది పట్టణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ టాటా నానో ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఏంటి అనే అధికారిక సమాచారం రానున్న రోజుల్లో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment