Tata Nano car
-
వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది
రతన్ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్‌గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకసారి రతన్‌టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. -
రతన్ టాటా కలల కారు ‘నానో’ ఈవీ కారుగా వచ్చేస్తుందా? అందులో నిజమెంత?
రతన్ టాటా ! పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు. అలాంటి రతన్ టాటాకు ‘నానో’ కారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కారే భారత మార్కెట్లో తిరిగి ఎలక్ట్రిక్ వెహికల్‌గా విడుదలవుతుందుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నానో ఎలక్ట్రిక్ కారుగా రాబోతుందా? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత? త్వరలో, టాటా గ్రూప్ నానో ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుందంటూ నానో’ పోలికతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు, టాటా నానో న్యూ అవతార్. కారు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుందనే ఆ ఫేక్ సోషల్ మీడియా ఫోటో సారాశం. ఇంతకీ నానో తరహాలో ఉన్న ఆ కారును ఏ ఆటోమొబైల్ కంపెనీ తయారు చేస్తుందనే అనుమానం రావొచ్చు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ‘టయోటా ఐగో’ హ్యాచ్‌బ్యాక్ కారును అమ్ముతుంది. కానీ ఈ కారు భారత్‌లో మాత్రం అందుబాటులో లేదు. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈవీ కార్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వాటి బడ్జెట్ ఎక్కువ కావడంతో వాహనదారులు టాటా గ్రూప్ బడ్జెట్ ధరలో ఈవీ కారును అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదిగో అప్పటి నుంచి టాటా సంస్థ నానో ఈవీ కారు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా, టాయోటా ఐగో కారు ఫోటోల్ని చూపిస్తూ.. ఇదే టాటా నానో ఈవీ కారు అంటూ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే, ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. నానో కారు ఇలా పుట్టిందే నానో కారు.. 15 ఏళ్ల క్రితం ఆటోమొబైల్ రంగంలో అదో పెను సంచలనం. రతన్ టాటా ప్రతి రోజు తన కారులో వెళ్లే సమయంలో స్కూటర్లపై వెళ్లుతున్న తల్లిదండ్రుల మధ్యలో కూర్చొవడం గమనించాను. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. అలా పురుడు పోసుకుందే నానో కారు. ప్రపంచంలో అత్యంత చౌకైన కారు.. కానీ 2008 జనవరి 10న టాటా మోటార్స్ ‘నానో’ కారును విడుదల చేసింది. సామాన్యుల కోసం టాటా కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది. చదవండి👉ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?
Ratan Tata Dream Car: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి 'రతన్ టాటా' (Ratan Tata) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన కలలు కారుగా ప్రసిద్ధి చెందిన 'టాటా నానో' (Tata Nano) గత కొంతకాలంగా దేశీయ విఫణిలో ఉత్పత్తికి నోచుకోలేదు. అయితే ఇది మళ్ళీ ఇండియన్ మార్కెట్లో కొత్త హంగులతో విడుదలవుతుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నానో ఎలక్ట్రిక్ కారు.. నివేదికల ప్రకారం, టాటా కంపెనీ తన ఐకానిక్ కారు నానో గురించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా అడుగెట్టే అవకాశం ఉంది. ప్రతి భారతీయుడు కారు కలిగి ఉండాలనే అభిప్రాయంతో రతన్ టాటా దీనికి ఊపిరి పోశారు. ఇప్పటి వరకు కూడా మనదేశంలో అతి తక్కువ ధరకు లభించే కారు టాటా నానో. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ప్రారంభంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు క్రమంగా అమ్మకాల విషయంలో వెనుకపడిపోయింది. అయితే దీనిని ఎస్ఆర్కే (SRK) డిజైన్స్ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారుగా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది పట్టణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ టాటా నానో ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఏంటి అనే అధికారిక సమాచారం రానున్న రోజుల్లో తెలుస్తుంది. -
నానో సోలార్ కార్! రూ.30కే 100 కిలోమీటర్లు..
పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి వీధుల్లో రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! మోండల్ కారు నడపడానికి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అవసరం లేదు. ఇది పూర్తిగా సౌర శక్తితో నడుస్తుంది. అయితే ఈ కారుకు అయ్యే ఇందన ఖర్చు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 30 నుంచి రూ. 35 లతో 100 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే కిలోమీటరుకు 80 పైసలు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో నడిచేలా మోండల్ రూపొందించిన నానో సోలార్ కార్ ఇప్పుడు అక్కడ సూపర్ పాపులర్ అయింది. ఇంజిన్ లేదు.. సౌండ్ లేదు.. ఈ సోలార్ కారులో గేర్ సిస్టమ్ ఉంది. కానీ ఇంజిన్ లేదు. ఇది నడుపుతున్నప్పుడు అసలు శబ్దం రాదు. నాల్గవ గేర్‌లో ఇది గంటకు 80 కిలోమీటర్లు వెళ్తుంది. మోండల్ చేసిన తయారు ఈ సోలార్ కార్ సౌరశక్తిలో ఆవిష్కరణల దిశగా దిశానిర్దేశం చేయడమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ కారును రూపొందించేటప్పుడు మోండల్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదల్లేదు. కొత్తగా ఏదైనా చేయాలనే అతని చిన్ననాటి కలను ఈ కారు ద్వారా నిజం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి! -
సూపర్ ఐడియా బాసూ.. అద్దె కోసం హెలికాప్టర్‌గా టాటా నానో కారు!
ఇటీవల కాలంలో కోడళ్ళను అత్తారింటికి తీసుకెళ్ళడానికి, పెళ్లి మండపానికి చేరుకోవడానికి చాలా మంది హెలికాఫ్టర్లు బుక్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సౌకర్యం కొందరు డబ్బున్నోళ్లకు మాత్రమే కుదరుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు హెలికాప్టర్ అద్దెకు తీసుకోవడం అనేది ఓ కలగానే ఉండిపోతుంది. సరిగ్గా ఈ వ్యాపారాన్ని టార్గెట్ చేశాడు బీహార్ రాష్ట్రంలోని భగా సిటీకి చెందిన మెకానిక్ గుడ్డు శర్మ. మధ్యతరగతి వాళ్లు కూడా పెళ్లిళ్లకు హెలికాప్టర్‌ను అద్దెకు ఇచ్చేందుకు గుడ్డు శర్మ డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం తన టాటా నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు. ప్రస్తుతం టాటా నానో కారును హెలికాఫ్టర్‌గా మార్చి దానిని రూ.15 వేలకు అద్దెకు ఇస్తున్నాడు. తక్కువ ధరకే హెలికాఫ్టర్ సేవలు అందుతుండటంతో అతడికి ఆర్డర్లూ పెరుగుతున్నాయి. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ప్రత్యేకమైన టాటా నానో కారుకి చెందిన కొన్ని చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ పాత నానో కారును హెలికాప్టర్‌గా మార్చడానికి సుమారు ₹2 లక్షలు ఖర్చు చేసినట్లు గుడు శర్మ పేర్కొన్నారు. కారును హెలికాప్టర్‌గా సిద్ధం చేయడానికి కొన్ని ప్రత్యేక సెన్సార్ల వినియోగించినట్లు పేర్కొన్నాడు. 'వివాహా సమయంలో హెలికాప్టర్లను బుక్ చేసుకోవడం కోసం ప్రజలలో చాలా ఉత్సాహం ఉంది. ఇక్కడ వాటి సేవలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది హెలికాప్టర్ ద్వారా తమ వివాహానికి వెళ్లాలని కోరుకుంటారు. కానీ అధిక ఛార్జీల కారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే నేను నా టాటా నానో కారును మార్పు చేర్పులు చేసి హెలికాప్టర్ డిజైన్ ఇచ్చాను. ఈ హెలికాప్టర్ సహాయంతో పేద ప్రజలు తమ అభిరుచిని తక్కువ మొత్తానికి నెరవేర్చకొగలరు" అని శర్మ అన్నారు. ఈ డిజిటల్ ఇండియా యుగంలో గుడ్డు శర్మ చేసిన ఈ ఆవిష్కరణ స్వావలంబన భారతదేశానికి సజీవ ఉదాహరణ. కాగా, గతంలో బీహార్ రాష్ట్రంలోని ఛప్రా గ్రామానికి చెందిన మిథిలేష్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా పైలట్ కావాలని కలలు కన్నాడు. కానీ దానిని కాలేకపోయాడు. దీంతో తన నానో కారును హెలికాప్టర్‌గా మార్చి దానికి తనే పైలట్'గా మారిపోయాడు. -
నానో తయారీ లేదు... అమ్మకాలూ లేవు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ చిన్న కారు నానో జనవరిలో ఒక్కటీ అమ్ముడుపోలేదు. అంతేకాదు, ఒక్క నానోను కూడా తయారు చేయలేదు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి నూతన భద్రతా ప్రమాణాలు, 2020 ఏప్రిల్ నుంచి వచ్చే బీఎస్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నానో కారును ఆధునీకరించే ప్రణాళికలు ఏవీ లేవని ఇటీవలే టాటా మోటార్స్ సేల్స్ విభాగం హెడ్ ప్రకటించిన విషయం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఒక్కనానో కారును కూడా తయారు చేయలేదని, గతేడాది ఇదే నెలలో మాత్రం 83 నానో కార్లను తయారు చేసినట్టు టాటా మోటార్స్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇక 2018 జవవరిలో దేశీయ మార్కెట్లో 62 నానో కార్లు అమ్ముడుపోగా, 2019 జనవరిలో ఒక్క నానో కూడా విక్రయం కాలేదని టాటా మోటార్స్ తెలిపింది. ఇక ఎగుమతుల విషయానికొస్తే గత నెలలో ఒక్క యూనిట్‌ను ఎగుమతి చేయలేదని, గతేడాది ఇదే నెలలోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించింది. ఈ విషయమై టాటా మోటార్స్ కంపెనీ ప్రతినిధిని మీడియా ప్రశ్నించగా... ప్రస్తుత రూపంలో ఉన్న నానో నూతన భద్రతా, కాలుష్య ప్రమాణాలను చేరలేదని, కొత్త పెట్టుబడులు అవసరమని చెప్పారు. ఈ విషయంలో ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటే నానోను తయారు చేస్తామని చెప్పారు. టాటా మోటార్స్ గతేడాది జూన్‌లో ఒక్క నానో కారును తయారు చేయగా, అదే నెలలో దేశీయ మార్కెట్లో మూడు నానో వాహనాలను విక్రయించింది. మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని టాటా మోటార్స్ నానో కారును తొలిసారిగా 2008లో మార్కెట్‌కు పరిచయం చేసింది. కానీ, వినియోగదారుల నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు.