Mahindra THAR Gets New Two Colour Options, Check Details - Sakshi

మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌: కొత్త ఆప్షన్స్‌తో పండగే!

Published Mon, Mar 13 2023 4:35 PM | Last Updated on Mon, Mar 13 2023 4:45 PM

Mahindra Thar gets new two colour options check details - Sakshi

సాక్షి,ముంబై: మహీంద్రాకు చెందిన పాపులర్‌ కారు థార్ ఎస్‌యూవీని  సొంతం చేసుకోవాలనే కస్టమర్లకు తీపి కబురు. పాపులర్‌ థార్‌ ఇపుడు కొత్త రంగుల్లో వినియోగ దారులకు అలరించనుంది. ఇప్పటి వరకు థార్ (4X2 RWD)వెర్షన్‌లకు మాత్రమే పరిమితమైన ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ ఆప్షన్స్‌ ఇపుడిక 4x4 వేరియంట్లలో కూడా లభించనున్నాయి. 

1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్  ఇలా  రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తున్న మహీంద్రా  థార్‌కు  (4X2 ) డిమాండ్‌ భారీగానే ఉంది. అయితే థార్  4x4 వేరియంట్‌లో  కొత్త కలర్‌ ఆప్షన్స్‌ లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తం 6 రంగుల్లో (ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్, ఆక్వా మెరైన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ , గెలాక్సీ గ్రే) మహీంద్రా థార్ లభించనుంది.

సుదీర్ఘ  వెయిటింగ్‌ పీరియడ్‌తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్ ఎస్‌యేవీలలో ఒకటి  థార్‌. మరోవైపు మహీంద్రా  కొత్త 5-డోర్ల థార్‌ను రాబోయే నెలల్లో దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 బిహెచ్‌పి ,300 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.అలాగే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో  జోడించగా,  ఇది 150 బీహెచ్‌పీని,  320 Nm టార్క్‌ను అందిస్తుంది. ఎంట్రీ-లెవల్ ధరతో మహీంద్రా థార్ ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభం (ఎక్స్-షోరూమ్, ఇండియా).
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement