న్యూఢిల్లీ: మహీంద్రా థార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన అప్ కమింగ్ వాహనం మహీంద్రా థార్ (5-డోర్స్)కు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కాపీ క్యాట్ చైనా దీన్ని కూడా కాపీ చేసేసింది. తాజాగా 'చైనీస్ వెర్షన్' పాకిస్తాన్‌లో తాజా థార్ తెలిస్తే షాక్‌అవుతారు. ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడు బోయింది.
చైనీస్ వాహన తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా అనేక పాపులర్ వాహనాల డిజైన్‌ను కాపీ చేయడంలో ముందుంటారు. కార్లు, మోటార్ సైకిళ్లను కూడా కాపీ చేస్తారు. దీనికి పెద్ద ఉదారణ మహీంద్రా థార్, బొలెరో మిశ్రమంతో వచ్చిందే చైనీస్ థార్‌గా పిలిచే BAIC BJ40 ప్లస్. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!)
పాక్‌వీల్స్ వెబ్‌సైట్ ప్రకారం, పాకిస్తాన్‌లో BAIC BJ40 ప్లస్ ధర రూ. 1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో మహీంద్రా థార్ ధర రూ. 10.54 లక్షల నుండి ప్రారంభం. ఇక డిజైన్ BAIC BJ40 ప్లస్ విషయానికి వస్తే, ఫీచర్లు, సైడ్ ప్రొఫైల్ ప్రముఖ రాంగ్లర్ ఎస్‌యూవీకి దాదాపు సమానం. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్‌ఎక్స్‌జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు)
BAIC BJ40 ప్లస్ వాహనంలో 2.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 5500 rpm వద్ద 218 hpని ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇంజీన్ 4500 rpm వద్ద 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో ఇది లభ్యం. అలాగే ఇకో, కంఫర్ట్, స్పోర్ట్స్, స్నోఫీల్డ్ 4 డ్రైవింగ్ మోడ్‌లతో వచ్చింది. దీంతోపాటు కొత్త తరం ఎలక్ట్రికల్ పార్ట్ టైమ్ 4WDని కూడా కలిగి ఉంది.
జీప్ రాంగ్లర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మహీంద్రా థార్ 5-డోర్ త్వరలోనే ఇండియాలోనే లాంచ్ కానుందని అంచనా. విక్రయాల్లో సరి కొత్త రికార్డులను చేరు కుంటుందని భావిస్తున్నారు.మహీంద్రా థార్ పాకిస్థాన్‌లో అందుబాటులో లేకపోవడంతో చైనీస్ మేకర్స్ ఈ ఎత్తుగడ వేశారు. కాగా BAIC BJ40 Plus ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)
Comments
Please login to add a commentAdd a comment