bolero
-
ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం
ధరూరు: బతుకుదెరువు కోసం ఆటోలో బయల్దేరిన ఆ కుటుంబాన్ని బొలెరో రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని పారుచర్ల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గద్వాలలోని దౌదర్పల్లికి చెందిన బొప్పలి జమ్ములమ్మ(55), ఆమె కుమారుడు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పల్లెల్లో నిత్యం బొంతలు కుట్టడం..పాత చీరలు అమ్మడం వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తమ ఆటోలో గద్వాల నుంచి రాయ్చూరుకు బయల్దేరారు. మార్గంలోని పారుచర్ల–ధరూరు గ్రామాల మధ్య రాయ్‌చూరు వైపు నుంచి వచ్చి న బొలెరో, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జమ్ములమ్మ, అర్జున్, వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాహనదారులు, చుట్టుపక్కల పొలాల రైతులు అక్కడికి చేరుకుని ఆటోలో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బొలెరోలో పెబ్బేరులో జరిగే సంతకు రైతులు ఎద్దులతో వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్‌తోపాటు మిగతా వారు పరారయ్యారు. అయితే అర్జున్‌కు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వైశాలితో వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. రేవులపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
‘పుష్ప’ తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి..
సాక్షి, విశాఖపట్నం: ‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు క్యాబేజీ బుట్టల మాటున గంజాయి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే బొలెరోలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది దీంతో పెందుర్తి వద్ద పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టగా గుట్టు రట్టైంది. క్యాబేజీ బుట్టలు కింద 14 బ్యాగుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయిని క్యాబేజీ బుట్టల లోడుతో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో ఉన్న బొలెరో వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
షాకింగ్ ప్రైస్: మహీంద్రా థార్ 'చైనీస్ వెర్షన్' ధర రూ. కోటి!
న్యూఢిల్లీ: మహీంద్రా థార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన అప్ కమింగ్ వాహనం మహీంద్రా థార్ (5-డోర్స్)కు ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కాపీ క్యాట్ చైనా దీన్ని కూడా కాపీ చేసేసింది. తాజాగా 'చైనీస్ వెర్షన్' పాకిస్తాన్లో తాజా థార్ తెలిస్తే షాక్అవుతారు. ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడు బోయింది. చైనీస్ వాహన తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా అనేక పాపులర్ వాహనాల డిజైన్‌ను కాపీ చేయడంలో ముందుంటారు. కార్లు, మోటార్ సైకిళ్లను కూడా కాపీ చేస్తారు. దీనికి పెద్ద ఉదారణ మహీంద్రా థార్, బొలెరో మిశ్రమంతో వచ్చిందే చైనీస్ థార్‌గా పిలిచే BAIC BJ40 ప్లస్. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) పాక్వీల్స్ వెబ్సైట్ ప్రకారం, పాకిస్తాన్లో BAIC BJ40 ప్లస్ ధర రూ. 1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో మహీంద్రా థార్ ధర రూ. 10.54 లక్షల నుండి ప్రారంభం. ఇక డిజైన్ BAIC BJ40 ప్లస్ విషయానికి వస్తే, ఫీచర్లు, సైడ్ ప్రొఫైల్ ప్రముఖ రాంగ్లర్ ఎస్‌యూవీకి దాదాపు సమానం. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు) BAIC BJ40 ప్లస్ వాహనంలో 2.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 5500 rpm వద్ద 218 hpని ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజీన్ 4500 rpm వద్ద 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో ఇది లభ్యం. అలాగే ఇకో, కంఫర్ట్, స్పోర్ట్స్, స్నోఫీల్డ్ 4 డ్రైవింగ్ మోడ్లతో వచ్చింది. దీంతోపాటు కొత్త తరం ఎలక్ట్రికల్ పార్ట్ టైమ్ 4WDని కూడా కలిగి ఉంది. జీప్ రాంగ్లర్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మహీంద్రా థార్ 5-డోర్ త్వరలోనే ఇండియాలోనే లాంచ్ కానుందని అంచనా. విక్రయాల్లో సరి కొత్త రికార్డులను చేరు కుంటుందని భావిస్తున్నారు.మహీంద్రా థార్ పాకిస్థాన్‌లో అందుబాటులో లేకపోవడంతో చైనీస్ మేకర్స్ ఈ ఎత్తుగడ వేశారు. కాగా BAIC BJ40 Plus ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) -
ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు అడ్డుగా బొలెరో.. ఢీ కొట్టిన రైలు
సాక్షి, ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. జిల్లా పరిధిలోని భీమడోలు వద్ద పట్టాలపై అడ్డంగా ఉన్న ఓ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో వాహనం తుక్కుతుక్కు కాగా, రైల్ ఇంజిన్.. ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో ప్రయాణికులు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏం జరిగిందంటే.. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రాక సందర్భంగా భీమడోలు జంక్షన్ వద్ద గేట్ వేశారు. అయితే.. బొలెరోలో వచ్చిన కొందరు గేట్‌ను ఢీ కొట్టి మరీ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో రైలు దగ్గరగా రావడంతో.. బొలెరోను అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక రైలు ఢీ కొట్టడంతో వాహనం ధ్వంసమైంది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో పలువురు ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. ఇక ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టి.. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
కానిస్టేబుల్ ధైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా !
గుజరాత్ వరదల సందర్భంగా ఓ కానిస్టేబుల్ చూపిన ధైర్యానికి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్మహీంద్రా ఫిదా అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆ కానిస్టేబుల్ని మెచ్చుకున్నారు. వరద నీటిలో ఇటీవల గుజరాత్లో కురిసిన భారీ వర్షాలకు రాజ్‌కోట్ సిటీ నీట మునిగింది. దాదాపు నడుము లోతు నీళ్లు చేరాయి. నేల కనిపించకుండా ఊరంతా చెరువులా మారిపోయింది. ఆ సమయంలో గుజరాత్ పోలీసులు మహీంద్రా బొలేరో వాహానంలో వరద నీటిని చీల్చుకుంటూ విధులు నిర్వర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను రీట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. తమ కంపెనీ వాహనాలు ఎంతో పవర్ఫుల్ అంటూ ట్వీట్ చేశారు. నీతో ఏకీభవిస్తున్నా ఆ ట్వీట్ వైరల్ అయిన తర్వాత వరదలో బోలోరే వాహనం నడిపిన కానిస్టేబుల్ జోషి నుంచి ఆనంద్ మహీంద్రాకు ఓ మేసేజ్ వచ్చింది. అందులో ‘ బొలేరో వాహనం ఎంతో పవర్ఫుల్ కారు కావొచ్చు. కానీ దాన్ని నడిపించాలంటే ఓ పవర్ ఫుల్ డ్రైవర్ కావాలి’ అంటూ ఉంది. ఆ మేసేజ్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఆనంద్ మహీంద్రా మరోసారి ట్వీట్ చేశారు. Received a message from Constable Joshi of the Rajkot Police Department who was driving the Bolero that day. He praised it & added: “Bolero is a powerful car. It also needs a powerful driver to drive it.” I agree with you Constable & kudos to you for doing your duty that day! https://t.co/Co5nver5nL — anand mahindra (@anandmahindra) September 22, 2021 చదవండి : Viral Video: ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ! -
గన్నవరంలో బొలెరో బీభత్సం..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాదచారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. మృతుడు దావాజిగూడెంకు చెందిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. బోలెరో వాహనం విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
యల్లాపుర వద్ద ఘోర ప్రమాదం
సాక్షి, యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా, యల్లాపుర తాలూకా అరబైల్‌ఘట్ట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య బొలెరో వాహనం ఇరుక్కుపోయి ఒక మహిళ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాగలకోటె జిల్లా లోకాపురకు చెందిన 8 మంది గోకర్ణకు బయలుదేరారు. అరబైల్‌ఘట్ట వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంతో లారీ ఢీకొంది. ఈ వేగానికి బొలెరో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా తాకింది. రెండు వాహనాల మధ్య బొలెరో ఇరుక్కుపోయి నుజ్జయ్యింది. స్థానికులు వచ్చి బొలెరోలో ఉన్నవారికి బయటకు తీశారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను యల్లాపుర ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వాణిజ్య వాహనమైన బొలెరో అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని లకి‡్ష్యంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.62 లక్షల వాహనాలను, 2018 ఆర్ధికంలో 1.49 లక్షలను విక్రయించామని.. ఏడాదిలో 9 శాతం వృద్ధిని నమోదు చేశామని ఎం అండ్ ఎం వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్– ఆటోమోటివ్ డివిజన్) విక్రమ్ గార్గా తెలిపారు. మంగళవారం కొత్త బొలెరో క్యాంపర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య వాహన శ్రేణిలో బొలెరో ఫ్లాగ్షిప్ బ్రాండ్ అని, 86 శాతం మార్కెట్ వాటా దీని సొంతమని ఆయన తెలిపారు. 3 రకాలు; ధర రూ.7.28 లక్షలు క్యాంపర్ నాన్ ఏసీ, క్యాంపర్ 4డబ్ల్యూడీ, క్యాంపర్ గోల్డ్ వీఎక్స్ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.7.28 లక్షలు. మూడేళ్లు లేదా లక్ష కి.మీ. వరకూ వారంటీ ఇస్తుంది. -
బొలెరోను ఢీ కొన్న డీసీఎం ; ఐదుగురు మృతి
-
ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం
మహబూబ్‌నగర్ : జిల్లాలోని హన్వాడ మండలం పెద్దదర్పల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలనను పోస్టుమార్టానికి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులను నాగంబాయితండాకు చెందిన గిరిజనులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బైక్‌ను ఢీకొట్టిన బొలేరో, ముగ్గురి మృతి
రంగారెడ్డి: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొత్తూరుగేట్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. శ్రీశైలం వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కందుకూరు మండలవాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సిద్దవటం: కడప–చెన్నై ప్రధాన రహదారిలోని కనుమలోపల్లె గ్రామ సమీపంలో ఉన్న శనేశ్వరస్వామి ఆలయం మలుపు వద్ద మంగళవారం ద్విచక్రవాహనం (స్కూటీ)ని, బొలేరో ఐస్ వాహనం ఢీకొన్న సంఘటనలో గోగుల లక్ష్మిసుబ్బమ్మ (25) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామ పంచాయతీ రామక్రిష్ణపురం గ్రామానికి చెందిన లక్ష్మిసుబ్బమ్మ కడప నగరంలోని స్పెన్సర్ దుకాణంలో పనిచేస్తుంది. ప్రతిరోజు ఆమె స్వగ్రామం నుంచి కడపకు స్కూటీలో వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకునేది. మంగళవారం కూడా యథావిధిగా స్కూటీలో డ్యూటీకి బయలుదేరింది. కనుమలోపల్లె గ్రామ సమీపంలోని మందగిరి శనేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న మలుపు వద్దకు రాగానే కడప నుంచి తిరుపతికి వెళుతున్న బొలేరో ఐస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మిసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహీంద్రా ‘బొలెరో’ కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.6.59 లక్షలు న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ‘బొలెరో’లో కొత్త వేరియంట్ ‘పవర్ ప్లస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.6.59 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ముంబై)గా ఉంది. ‘బొలెరో పవర్ ప్లస్’లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వాయిస్ మెసేజింగ్ వ్యవస్థ, ఫ్యూయెల్ సేవింగ్ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో ఎంహక్ డీ70 ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొం ది. దీంతో ఈ కొత్త వేరియంట్ ప్రస్తుత బొలెరో వాహనాల కన్నా 13 శాతం అధిక శక్తిని, 5 శాతం ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుందని వివరించింది. ప్రస్తుత బొలెరో శ్రేణికి చెందిన వాహనాల ధర కన్నా కొత్త వేరియంట్ ధర రూ.1 లక్ష తక్కువ గా నిర్ణయించామని తెలిపింది. -
బైక్, బోలేరో ఢీ- వ్యక్తి మృతి
మఠంపల్లి(నల్గొండ ): మఠంపల్లి మండలకేంద్రంలో హుజూర్నగర్-మత్తపల్లె రహదారిపై ఇండియల్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద బైక్, బోలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రఘనాధపాలెం గ్రామానికి చెందిన రామాంజనేయులు(32) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు - కారు ఢీ : 13 మంది మృతి
-
హైదరాబాద్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
-
బోలెరో బోల్తా: ఆరుగురికి గాయాలు
విశాఖపట్నం : శుక్రవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శిలానగర్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. టైరు పంక్చర్ కావడమే వాహనం బోల్తా పడటానికి కారణమని తెలుస్తోంది. బోలెరోలో వరుణ్ జేసీబీ కంపెనీకి చెందిన ఐదుగురు మహిళలు, మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. -
బొలెరో వాహనం బోల్తా: 20 మందికి గాయాలు
కొండాపురం: వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం పొలకలకు వెళుతున్న బొలెరో క్యాంపర్ వాహనానికి టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, తడకల చెరువు గ్రామానికి చెందిన వారని తెలిసింది. -
లారీని ఢీకొన్న బొలేరో, ముగ్గురు మృతి
వరంగల్ : ఖమ్మం జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారు వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని .. వరంగల్ వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు మెట్రో రైలు కాంట్రాక్టర్ సోమేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.