సాక్షి, ఏలూరు: దురంతో ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. జిల్లా పరిధిలోని భీమడోలు వద్ద పట్టాలపై అడ్డంగా ఉన్న ఓ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో వాహనం తుక్కుతుక్కు కాగా, రైల్ ఇంజిన్.. ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో ప్రయాణికులు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఏం జరిగిందంటే.. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రాక సందర్భంగా భీమడోలు జంక్షన్ వద్ద గేట్ వేశారు. అయితే.. బొలెరోలో వచ్చిన కొందరు గేట్‌ను ఢీ కొట్టి మరీ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో రైలు దగ్గరగా రావడంతో.. బొలెరోను అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక రైలు ఢీ కొట్టడంతో వాహనం ధ్వంసమైంది.
మరో ఇంజిన్ మార్చాల్సి రావడంతో పలువురు ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. ఇక ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టి.. దుండగుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment