కొండాపురం: వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం పొలకలకు వెళుతున్న బొలెరో క్యాంపర్ వాహనానికి టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, తడకల చెరువు గ్రామానికి చెందిన వారని తెలిసింది.