కానిస్టేబుల్‌ ధైర్యానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా ! | I Agree with you Constable Said By Anand Mahindra | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ధైర్యానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా !

Published Wed, Sep 22 2021 4:10 PM | Last Updated on Thu, Oct 21 2021 9:09 AM

I Agree with you Constable Said By Anand Mahindra - Sakshi

గుజరాత్‌ వరదల సందర్భంగా ఓ కానిస్టేబుల్‌ చూపిన ధైర్యానికి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌మహీంద్రా ఫిదా అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఆ కానిస్టేబుల్‌ని మెచ్చుకున్నారు. 

వరద నీటిలో
ఇటీవల గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలకు రాజ్‌కోట్‌ సిటీ నీట మునిగింది. దాదాపు నడుము లోతు నీళ్లు చేరాయి. నేల కనిపించకుండా ఊరంతా చెరువులా మారిపోయింది. ఆ సమయంలో గుజరాత్‌ పోలీసులు మహీంద్రా బొలేరో వాహానంలో వరద నీటిని చీల్చుకుంటూ విధులు నిర్వర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను రీట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.  తమ కంపెనీ వాహనాలు ఎంతో పవర్‌ఫుల్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

నీతో ఏకీభవిస్తున్నా
ఆ ట్వీట్‌ వైరల్‌ అయిన తర్వాత వరదలో బోలోరే వాహనం నడిపిన కానిస్టేబుల్‌ జోషి నుంచి ఆనంద్‌ మహీంద్రాకు ఓ మేసేజ్‌ వచ్చింది. అందులో ‘  బొలేరో వాహనం ఎంతో పవర్‌ఫుల్‌ కారు కావొచ్చు. కానీ దాన్ని నడిపించాలంటే ఓ పవర్‌ ఫుల్‌ డ్రైవర్‌ కావాలి’ అంటూ ఉంది. ఆ మేసేజ్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఆనంద్‌ మహీంద్రా మరోసారి ట్వీట్‌ చేశారు. 

చదవండి : Viral Video: ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement