పానీపూరి.. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. పానీపూరీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇప్పటికీ పానీపూరీనే చాలామందికి ఫేవరెట్ స్ట్రీట్‌ఫుడ్. గోల్ గప్పా, గప్ చుప్ అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తుంటారు.
సాయంత్రం అయిందంటే చాలు వీధి చివరన పానీపూరీ బండి వద్ద జనాలు గుమిగూడతారు. లొట్టలేసుకొని మరీ పానీపూరీని ఆరగిస్తుంటారు. ఎంతో ఇష్టంగా తినే పానీపూరీ వంటకం ఇప్పటిది కాదట. మహాభారత కాలం నుంచే ఉందట. మరి అప్పట్లో పానీపూరీని కనిపెట్టింది ఎవరు? ఏంటా స్టోరీ అన్నది ఇప్పుడు చూద్దాం.
పురాణాల ప్రకారం.. పానీపూరీని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు.పెళ్లయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఒక ఆలుగడ్డ, ఒక్క చనాతీకి మాత్రమే సరిపడా పిండిని అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలిని తీర్చి భర్తల మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసురుతుందట.
అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతోనే చిన్నచిన్న పూరీలు చేసి భర్తల ఆకలిని తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతిదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరీ శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పట్నుంచి పానీపూరీ ప్రజలకు పరిచయం అయ్యిందని అంటుంటారు.
Comments
Please login to add a commentAdd a comment