అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
Published Mon, Jul 10 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
– భర్తే హత్య చేశాడని బంధువుల ఆరోపణ
– పరారీలో భర్త
వెల్దుర్తి(కృష్ణగిరి): వెల్దుర్తి పట్టణంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న కౌసల్య(28) అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లాల్‌జీ, కౌసల్య దంపతులకు ఇద్దరు సంతానం. వీరు ఏడాది కాలంగా పానీపూరి వ్యాపారం చేసుకుంటూ వెల్దుర్తిలోనే జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్న వీరి కుమారుడు చిన్నారి హేమంత్‌ను కౌసల్య మేనమామ లక్ష్మణ్ వారం రోజుల క్రితం వెల్దుర్తికి తీసుకొచ్చాడు. కాగా ఆదివారం రాత్రి భార్య, భర్త, కుమారుడు ఇంట్లో నిద్రించగా లక్ష్మణ్ ఇంటి ముందు నిద్రించాడు. ఉదయం నిద్రలేచి ఇంట్లోకి వెళ్లిన లక్ష్మణ్‌కు కౌసల్య నిర్జివంగా పడివుండటాన్ని గమనించాడు. విషయాన్ని తమ బంధువులకు చేరవేశాడు. కాగా సమీపంలోనే బెల్ట్ ఉండటం, ముక్కు నుంచి రక్తం కారడం, లాల్‌జీ కనిపించకుండా పోవడం బట్టి హత్య చేసివుంటాడని బంధువులతో పాటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నాగేష్ తెలిపారు.
Advertisement
Advertisement