ఐస్‌క్రీమ్ పానీపూరీ కావలసినవి:
ఐస్ క్రీమ్ – పావు కప్పు చొప్పున 2 రకాలు (ముందుగానే నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్.. కాస్త మెల్ట్ అయ్యాక కవర్‌లో వేసుకుని.. కోన్ లా చేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి) పానీపూరీ – 10 లేదా 15
డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ – 300 గ్రా. (ఒక వంద గ్రాములు తురుములా కోరి పక్కనే పెట్టుకోవాలి)
కమలాపండు తొనలు – 10 (గార్నిష్ కోసం)
చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, డార్క్ స్ప్రింకిల్స్
కలర్ స్ప్రింకిల్స్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున (అభిరుచిని బట్టి)
తయారీ విధానం: ముందుగా ఓవెన్ లో 200 గ్రాముల డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ కరిగించి, ప్రతి పానీపూరీని కాస్త చిదిమి, దానికి మొత్తం చాక్లెట్ క్రీమ్ పట్టించి, ఆ పూరీలన్నిటినీ పావుగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ప్రతి పానీపూరీలో రెండు ఐస్ క్రీమ్స్ నింపుకుని, చాక్లెట్ తురుము, కమలాపండు తొనలతో గార్నిష్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, కలర్ స్ప్రింకిల్స్, డార్క్ స్ప్రింకిల్స్ వాటిపై వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment