పానీ పూరీ అంటేనే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. దాని గురించి ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా, పానీ పూరీకున్న క్రేజ్‌ముందు అవన్నీ దిగదిడుపే. అందుకే దుకాణదారులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా వెరైటీ పానీపూరీ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
బంగారం, సిల్వర్ రంగుల్లో పానీపూరీలు తెగ వైరల్‌అవుతున్నాయి. ఫుడ్ హ్యాండిల్ అనే ఇన్‌స్టా ఖాతా వివరాల ప్రకారం పూరీలపై బంగారు , వెండి రేకులను పూయడం ఇందులో చూడొచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో పానీపూరీలను విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా జోడిస్తున్నాడు. వీటిని బంగారు రంగు ప్లేట్‌లోనే పెట్టి అందిస్తుండటం మరో విశేషం. దీన్ని షారియత్ అంటారట. దేశంలోఇదే తొలి హైజీనిక్ పానీ పూరీ అట. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇది ‘‘ బప్పి లాహిరి పానీ పూరి అని పిలవాలి అని ఒకరు వ్యాఖ్యానించగా, దీని పేరును కూడా మార్చండి” బ్రో అని మరొక నెటిజన్ కమెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment