బయటకొచ్చారంటే చాలా మంది పానీపూరీ తినకుండా ఉండరు. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించగానే, పానీపూరీ తినందే రోజుగడవని పానీపూరీ ప్రియులెందరో ఎంతగానో తల్లడిల్లిపోయారు. అయినా పానీపూరీ ప్రియులంతా నోటికి తాళం వేసుకోక తప్పలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు చేసి ఇచ్చే తినుబండారాలు కావడంతో, వీటిని ఏ జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌లోనో ఇంటికి తెప్పించుకొని ఆరగించే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పానీపూరీ లేని కొరత తీర్చలేనిదంటూ సోషల్ మీడియాలో చాలా జోక్స్ చక్కర్లు కొట్టాయి. అయితే సోషల్ మీడియా జోక్స్‌కి చెక్‌పెట్టేసే రోజొచ్చింది.
(చదవండి: కరోనా కేళి.. జేబులు ఖాళీ!)
సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఎవర్నీ అంటుకోకుండా, పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతుల్లో పెట్టే పానీపూరీ విక్రయ యంత్రం మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వీడియో నెటిజన్ల మదిని దోచేస్తోంది. పానీపూరీ వెండింగ్ మెషీన్‌లో 20 రూపాయల నోటుని ఉంచితే సరి, మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే గోల్‌గప్పా ప్రత్యక్షం అవు తుంది. ఈ యంత్రం అభివృద్ధిపరిచేందుకు ఆరు నెలల కాలం పట్టిందని, ఈ యంత్రం వినియోగాన్ని గురించి వీడియోలో వివరించిన వ్యక్తి చెప్పారు. ఈ పానీపూరీ యంత్రం ఆవిష్కర్తలను అస్సాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హార్ది సింగ్, ‘ఇది భారతీయుల నిజమైన చాతుర్యం’అని ప్రశంసించారు.
(చదవండి: పానీపూరి ప్రియులను కలవరపరిచే వంటకం)
Comments
Please login to add a commentAdd a comment