Shocking Video: Pani Puri Seller Mixing Urine In Water - Sakshi
Sakshi News home page

Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా

Published Sun, Aug 22 2021 3:28 PM | Last Updated on Mon, Aug 23 2021 3:31 PM

Video Of Pani Puri Seller Mixing Urine In Water Goes Viral - Sakshi

Assam Man Mixing Urine In Pani Puri Water: సోషల్‌ మీడియాలో వచ్చే వాటిలో కొన్ని వైరల్ గా మారి రచ్చ చేస్తే, మరి కొన్ని మాత్రం మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేస్తాయి. ఇక నోరూరించే వంటకాలు సైతం నెట్టింట కనిపించడం ఇటీవల ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. అదే క్రమంలో కొన్ని ఘటనలు చూస్తే బయట తిండి తినాలంటే భయమేస్తుంది. ప్రత్యేకంగా బయట పుడ్‌ ఇష్టపడే భోజన ప్రియులు రోడ్డు పక్కన తినే తినుబండారాల విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చాటే ఒక వీడియో తాజాగా వైరల్ అవడమే గాక చూసిన వారిని షాక్‌కు గురి చేస్తుంది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది.

అసలు ఏముంది అందులో.. గువహటి నగరంలో ఓ పానీ పూరీ బండి నిర్వహకుడు చేసిన పని చూస్తే అత్యంత అసహ్యంగా అనిపిస్తోంది. పాస్టపుడ్‌ సెంటర్లు మొదలైనప్పటి నుంచి భోజన ప్రియులు బయట పుడ్‌ తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో పానీపూరి తినే వారి జాబితా పెద్దదే అని చెప్పాలి. అయితే వారు ఈ వీడియో చూస్తే మాత్రం ఇకపై తినడం మానేస్తారేమో. రోడ్డు పక్కన పానీపూరీ బండితో జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి పానీపూరి చేస్తూనే మరో వైపు ఏమీ తెలియనట్లు మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పట్టి దాన్ని పానీపూరీ బకెట్‌లో కలిపాడు.

కాగా అతను ఇది ఎందుకు చేశాడు తెలియదు. అయితే ఈ వ్యవహారమంతా ఎవరో చాటుగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అతి జుగుప్సాకరమైన దీన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ఇది ఆహార శాఖ అధికారుల వరకు చేరింది. వెంటనే అధికారులు స్పందించి సదరు స్ట్రీట్ వెండర్ అయిన పానీపూరీ బండి నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు  పక్కన అమ్మే తినుబండారాలాను తినేముందు ఒకసారి ఆలోచించుకోవాలిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement