
టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో దెబ్బకు టెలికాం సంస్థలు అన్నీ ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయనే చెప్పాలి. ఉచిత కాల్స్, డేటా పేరుతో మార్కెట్‌లో హల్‌చల్ చేసింది. జియోను ఆదర్శంగా తీసుకున్న పానీపూరి వ్యాపారి తన వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు ప్రకటించాడు. జియోలో అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు లాగే జియో అన్‌లిమిటెడ్ పానీపూరీ అంటూ ఆఫర్లను ఫ్లెక్సీ పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో అక్కడి పానీపూరి ప్రియులు భలే చౌక బేరం అంటూ పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పానీపూరి వ్యాపారి ప్రకటించిన ఆఫర్లు ఏంటంటే.. 80 రూపాయలు చెల్లిస్తే గంటపాటు అన్ లిమిటెడ్‌గా పానీపూరి. 200 రూపాయలకు ఒకరోజు మొత్తం, 2000 రూపాయలకు ఒక నెల మొత్తం పానీపూరి అన్ లిమిటెడ్‌గా తినొచ్చు.