
కార్పొరేట్, లేదా టెకీ ఉద్యోగం అంటేనే అంతులేని పని ఒత్తిడి. పగలూ రాత్రీ తేడాలేని పనివేళలు,నిబంధనలతో పనిలేకుండా గంటలకొద్దీ అలా పని చేయాల్సిందే. ఇలాంటి సవాలక్ష సవాళ్లు ఉద్యోగం అంటేనే నిస్తేజం. జీవితం గడవాలి కాబట్టి ఎలాగోలా తట్టుకుని నెట్టుకొస్తున్నా ఇటీవలి కాలంలో లేఆఫ్స్ భూతం ఉద్యోగులను మరింత వేధిస్తోంది. ఆర్థికమాంద్యం, ఖర్చుల తగ్గింపు పేరుతో అనేక కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పారిశ్రామికవేత్త హర్షగెయెంకాను ఈ వీడియోను ఆకర్షించింది. ఆయన కూడా ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కార్పొరేట్ ఉద్యోగం కంటే..పానీ పూరీ విక్రయించుకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఇదొక విషాదకర పరిస్థితి అని అంటే, మధ్య తరగతి వాళ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ధనవంతులు. ఎందుకుంటే వారు ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ చేస్తారని మరొకరు కామెంట్ చేశారు. మరో యూజర్ ఏమన్నారంటే పానీ పూరి వ్యాపారి ఎక్కువ సంపాదించినా కూడా కార్పొరేట్ ఉద్యోగికి గౌరవం లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో పనతోపాటు ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే. టైంకి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళికల్లాంటివి ఉంటాయి. (యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చేశాడు!)
కార్పొరేట్ ఉద్యోగులు ఉద్యోగపరంగా మరింతపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణులతో కలిసి పనిచేయడం లేదా ప్రసిద్ధ కంపెనీలో పని చేయడం అనేది వారికి వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగిగా ఉండాలా లేక పానీ పూరి వ్యాపారిలా ఉండాలి అనే నిర్ణయం వైయుక్తికమైంది. ఏది మంచి, ఏది చెడు అనేది వారి వారి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.
Why would you be a corporate employee! pic.twitter.com/NY23wLeem8
— Harsh Goenka (@hvgoenka) October 19, 2023