Corporate jobs
-
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
పూలు అమ్ముతూ నెలకు ఏకంగా రూ. 13 లక్షలు..!
మంచి హోదా కలిగిన కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరి కొందరూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆటుపోట్లను ఎదుర్కొంటారు. కొందరూ తగ్గేదేలా అంటూ కష్టపడి మరీ విజయశిఖరాలను చేరుకుంటారు. అయితే అందరూ ఈ సాహసం చేయలేరు. కొందరూ ఈ సాహసం చేసి మరీ విజయతీరాలకు చేరుకుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె ఏం వ్యాపారం చేసిందంటే..వివరాల్లోకెళ్తే..29 ఏళ్ల వియన్నా హింట్జ్ అనే యూఎస్ మహిళ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైస్మెంట్కి సంబంధించిన కార్పొరేట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ పూల వ్యాపారం మొదలు పెట్టింది. ఆమె పూల వ్యాపారం విజయవంతమైన ఏకంగా నెలకు రూ. 13 లక్షలు ఆర్జిస్తోంది. ఆమె సైరాక్యూస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. న్యూయార్క్ నగరంలోని ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైస్మెంట్ విభాగంలో పనిచేసేదాన్ని అని తెలిపింది. ఐతే ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదని, ఏదో ఒకటి చేయాలన్నా ఆరాటంతో అసంతృప్తిగా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో స్వంత డిజటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. అయినా ఏదో అసంతృప్తి వెంటాడేది. అప్పుడే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకున్నట్లు వివరించింది. ఆ థెరపిస్ట్ ఇష్టమైన ఉద్యోగాల జాబితాను రూపొందించి వాటిలో తనకు నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం చేయమని వియన్నాకు సలహ ఇచ్చింది. అప్పుడే వియన్నాకు తన స్నేహితులతోనూ, ప్రజలతో కలిసి పనిచేసే వ్యాపారం ఎంచుకోవాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నదే తడువుగా పాత పికప్ ట్రక్‌ని తెచ్చి అందులో స్వంతంగా పూల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ ట్రక్ పేరు మెయిన్ స్ట్రీట్ ట్రక్. వియన్నా 2023 నుంచి ఈ వ్యాపారం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె వ్యాపారం ఏడాదికి దాదాపు రూ.36 లక్షలు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అంతేగాక రూ. 3 లక్షలకు పైగా లాభాలను ఆర్జించింది. కేవలం గత మే నెలలో సుమారు రూ. 13 లక్షలు సంపాదించినట్లు చెప్పుకొచ్చింది వియన్నా. పువ్వులు కాలానుగుణంగా ఉంటాయి కాబట్టి, ఆయా నెలల్లో ఇతరుల కన్నా ఎక్కువ డబ్బు ఆర్జించగలిగానని చెప్పుకొచ్చింది. అలాగే కొన్ని ముఖ్యమైన రోజులు వాలెంటైన్స్ డే, మదర్స్ డే వంటి సెలవుల్లో మాత్రం అమ్మకాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పింది. ఇక తాను ఈ వ్యాపారాన్నే ఎంచుకోవడానికి తన తల్లిదండ్రులే కారణమని అంటోంది. వియన్నా తండ్రి అగ్రిమాపక దళంలో పనిచేస్తారు. అయితే ఆయన ఉద్యోగానికి పికప్ ట్రక్‌లో వెళ్లేవారని, అలాగే తన తల్లికి గార్డెనింగ్ అంటే ఇష్టమని అందువల్లే తాను ఇలా పికప ట్రక్‌లో పూల వ్యాపారం చేయాలని భావించినట్లు తెలిపింది. అంతేగాదు తనకు నచ్చిన పూల వ్యాపారం చేస్తూ..ఈ ట్రక్‌లో తన నాన్నతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ హయిగా వ్యాపారం చేస్తున్నాని చెబుతోంది. నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే ఎన్నో లాభాలు ఆర్జించొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు అని ప్రూవ్ చేసింది వియన్నా. అంతేగాదు తన ట్రక్‌కి తన కంపెనీ పేరు పెట్టాలనుకుంటున్నట్లు కూడా చెబుతోంది. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
ఉద్యోగమా? పానీ పూరీ అమ్ముకోవడమా? ఏది బెటర్: వైరల్ వీడియో
కార్పొరేట్, లేదా టెకీ ఉద్యోగం అంటేనే అంతులేని పని ఒత్తిడి. పగలూ రాత్రీ తేడాలేని పనివేళలు,నిబంధనలతో పనిలేకుండా గంటలకొద్దీ అలా పని చేయాల్సిందే. ఇలాంటి సవాలక్ష సవాళ్లు ఉద్యోగం అంటేనే నిస్తేజం. జీవితం గడవాలి కాబట్టి ఎలాగోలా తట్టుకుని నెట్టుకొస్తున్నా ఇటీవలి కాలంలో లేఆఫ్స్ భూతం ఉద్యోగులను మరింత వేధిస్తోంది. ఆర్థికమాంద్యం, ఖర్చుల తగ్గింపు పేరుతో అనేక కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పారిశ్రామికవేత్త హర్షగెయెంకాను ఈ వీడియోను ఆకర్షించింది. ఆయన కూడా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కార్పొరేట్ ఉద్యోగం కంటే..పానీ పూరీ విక్రయించుకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఇదొక విషాదకర పరిస్థితి అని అంటే, మధ్య తరగతి వాళ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ధనవంతులు. ఎందుకుంటే వారు ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ చేస్తారని మరొకరు కామెంట్ చేశారు. మరో యూజర్ ఏమన్నారంటే పానీ పూరి వ్యాపారి ఎక్కువ సంపాదించినా కూడా కార్పొరేట్ ఉద్యోగికి గౌరవం లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో పనతోపాటు ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే. టైంకి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళికల్లాంటివి ఉంటాయి. (యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!) కార్పొరేట్ ఉద్యోగులు ఉద్యోగపరంగా మరింతపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణులతో కలిసి పనిచేయడం లేదా ప్రసిద్ధ కంపెనీలో పని చేయడం అనేది వారికి వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగిగా ఉండాలా లేక పానీ పూరి వ్యాపారిలా ఉండాలి అనే నిర్ణయం వైయుక్తికమైంది. ఏది మంచి, ఏది చెడు అనేది వారి వారి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. Why would you be a corporate employee! pic.twitter.com/NY23wLeem8 — Harsh Goenka (@hvgoenka) October 19, 2023 -
కార్పొరేట్ ఇంజినీర్ కన్నా క్యాబ్ డ్రైవరే నయం! సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన. రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్‌లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్కామ్ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్ డ్రైవింగ్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు. శ్వేత ఆగస్ట్ 6న ఈ ట్వీట్ చేయగా ఇప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్‌లు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్ జాబ్‌లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు. I was in a cab yesterday and that driver was an engineer. He said he earns more from the cab driving than his corporate job at Qualcomm. 🥲 — Shweta Kukreja (@ShwetaKukreja_) August 6, 2023 -
నర్తనమే‘ప్రీతి’కరం
ప్రొఫెషన్కార్పొరేట్ జాబ్ అనుకున్నంత తేలికేం కాదు. పెద్దజీతం వెనుకే ప్రాజెక్టులు, టార్గెట్ల మానసిక ఒత్తిడి తప్పదు. శాస్త్రీయ నృత్యమంటే నల్లేరుపై నడక కాదు. దానికి కళాపిపాస మాత్రమే కాదు, కఠోర సాధన కావాలి. ఈ రెండు రంగాల్లోనూ ఏకకాలంలో రాణించాలంటే మనో నిబ్బరం, శారీరక సామర్థ్యం ఉండాలి. అవి ఉన్న వారికి వేదికలు నీరా‘జనాలు’ పడతాయి. కార్పొరేట్ సంస్థలు కళాభినందనలు కురిపిస్తాయి. నర్తనమే‘ప్రీతి’కరం ‘‘పని ఒత్తిడి ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువగా డ్యాన్స్క్లాస్లో గడుపుతా’’ నన్నారు బేగంపేట నివాసి, ఎస్ అండ్ పి క్యాపిటల్ ఐక్యూ కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్‌గా చేస్తున్న ప్రీతి. ‘‘ డ్యాన్స్ చేస్తుంటే వచ్చే తృప్తి మరెందులోనూ రాదు’’ అంటున్నారు. పదేళ్లుగా నృత్యసాధనలో ఉన్న ప్రీతి, మూడేళ్ల క్రితమే జాబ్‌లో జేరారు. ఉద్యోగంలో చేరాక నృత్యసాధన కష్టం కాలేదా? అన్న ప్రశ్నకు ‘‘జాబ్ మొదలుపెట్టాక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం పెరిగింది. చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఒరిస్సా, పూరి ఇలా ఎన్నో చోట్ల లాస్ట్ త్రీ ఇయర్స్‌లో ప్రదర్శనలిచ్చా’’ అంటూ వివరించారు. ‘‘కొండాపూర్‌లో ఆఫీస్, దోమలగూడలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్.. నేనుండేది బేగంపేట. రోజూ 3గంటల దాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. టైమ్ బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టం అనిపించడం లేదు’’ అంటూ చెప్పారామె. తనకు ఆఫీస్‌లో ప్రత్యేకమైన గౌరవం అందుతున్న వైనాన్ని చెబుతూ.. ‘‘నా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్‌ను దాని ప్రకారం సెట్ చేయడం అవీ మా బాస్‌లు చూస్తార’’న్నారు. అభిరుచి బలమైనది. సంప్రదాయం అంతకంటే బలమైనది. సంప్రదాయ కళలపై అభిరుచి ఏర్పడితే, ఎంతటి వ్యయప్రయాసలకైనా వెనుకాడరు కళాకారులు. ఒకవైపు ఊపిరి సలపని విధినిర్వహణలో సతమతమవుతూనే, మరోవైపు తమకు అభిరుచి గల సంప్రదాయ కళలో రాణిస్తున్నారు నగరానికి చెందిన ముగ్గురు యువతులు. మనసుంటే మార్గాలకు లోటుండదని వీరు రుజువు చేస్తున్నారు. ప్రసిద్ధ నర్తకి శోభానాయుడు అకాడమీలో సాధన చేసే వీరు ‘సిటీప్లస్’తో తమ ముచ్చట్లు చెప్పారు. డ్యాన్స్ ‘హోస్టెస్’ నాట్యం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. ఈ మాట ఒక ఎయిర్‌హోస్టెస్ నోటి నుంచి వినిపిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నిత్యం ఆకాశయానం చేసే లావణ్య మనసు గాల్లో విహరించేది మాత్రం కాళ్లకు గజ్జెలు కట్టినప్పుడే. గచ్చిబౌలి నివాసి అయిన ఆమె జీతం కోసం విమానాల్లో విధులు నిర్వర్తిస్తూ, జీవితాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం నాట్యంతో సహవాసం చేస్తున్నారు. ‘‘నృత్యసాధన 8వతరగతిలో స్టార్ట్ చేశాను. వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాను. డ్యాన్స్ ఒక వ్యసనం లాంటిది. టెన్షన్స్ అన్నీ పోతాయి. అకాడమీ ఒక టెంపుల్ లాంటిది. డ్యాన్స్‌తో నాకు డిసిప్లిన్, పంక్చువాలిటీ, కాన్సన్ట్రేషన్.. అన్నీ వచ్చాయి. అందుకే మంచి జాబ్ వచ్చినా డ్యాన్స్ వదలదలచుకోలేదు. 2005 నుంచి ఎయిర్ఇండియాలో జాబ్ చేస్తున్నా. రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఫ్లయిట్ టైమింగ్స్‌తో ప్రతి రోజూ ప్రాక్టీస్‌కి వెళ్లలేను. అయితే మా ఆఫీసు వాళ్లు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు టైమింగ్స్ ఎడ్జస్ట్ చేస్తారు. తాజాగా ఢిల్లీలో ఎయిర్ఇండియా వాళ్ల ప్రోగ్రామ్‌లో నా ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయటి నుంచి రాగానే మమ్మీ అన్నీ రెడీ చేసి పెడుతుంది. డ్యూటీ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి, కాస్ట్యూమ్స్ తీసుకుని డ్యాన్స్ క్లాస్‌కి వెళతా. 3గంటలు సాధన చేస్తా’’ అంటూ వర్క్టైమింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్న వైనాన్ని చెప్పారు లావణ్య. నృత్యమే ‘నిత్య’కృత్యం నృత్యమే తన నిత్యకృత్యం అంటున్నారు టీసీఎస్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిత్య. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో నివసించే ఆమె.. ఆరేళ్ల వయసులో అమ్మ ప్రోత్సాహంతో నృత్యసాధన ప్రారంభించారు. ‘చదువు, వీణ, డ్యాన్స్.. ఇలా దాదాపు పదహారేళ్లు గడిచింది. చదువు దెబ్బతింటుందని చాలామంది టెన్త్‌క్లాస్‌లో పూర్తిగా పుస్తకాలకే అంకితమవుతారు. నేను అప్పుడు కూడా ఇవి మానలేదు. టెన్త్‌లో 92శాతం పైన మార్కులు సాధించాను. ఎంసెట్‌లో సిటీ పరిధిలో 21వ ర్యాంక్ తెచ్చుకున్నాను. జేఎన్టీయూలో ఫ్రీ సీట్ వచ్చింది. నా చదువంతా మెరిట్ స్కాలర్షిప్ మీదే సాగిందంటే అది డ్యాన్స్ పుణ్యమే. నృత్యం నాకు చాలా గుర్తింపు కూడా తెచ్చింది. ప్రతిష్టాత్మక డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాను. కంపెనీ తరఫున ముంబైలోని టాటా హౌస్‌లో జేఆర్డీ టాటా 157వ జయంతి సందర్భంగా ఫారిన్ డెలిగేట్స్ ముందు మేడమ్ శోభానాయుడు కొరియోగ్రఫీ చేసిన నృత్యం ప్రదర్శించాను. అకాడమీలో బైక్ పార్క్ చేసుకుని, ఆఫీసుకు వెళతాను. ఆఫీసు నుంచి అకాడమీకి తిరిగొచ్చి, ప్రాక్టీస్ అయ్యాక బైక్ మీద ఇంటికొస్తాను. రోజుకు గంటన్నర ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందో ముందే తెలియదు కాబట్టి ఆఫీసు వర్క్‌లో అడ్వాన్స్‌గా ఉంటాను’ అని తన నృత్య సాధనను వివరించారు నిత్య. -
ఐటీ కొలువుల్లో మేటి.. సిటీ
టాప్ స్టోరీ: హైదరాబాదీ యువతకు శుభవార్త. సర్కారీ ఉద్యోగాల సంగతెలా ఉన్నా.. కార్పొరేట్ జాబ్స్ కల నెరవేరనుంది. మహానగరం ‘జాబ్సిరి’కి స్వాగతం పలుకనుంది. ఎంతోకాలంగా ఊరిస్తున్న కార్పొరేట్ కొలువులు.. త్వరలోనే యువత ముంగిట వాలనున్నాయి. ఐటీ కంపెనీలు కాలేజీ క్యాంపస్‌ల ముందు క్యూ కట్టనున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో సిటీలో హైరింగ్ ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు! మళ్లీ ఐటీ బూమ్ ఖాయం: ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్, రిటైల్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరి ఉన్నాయి. వాటిలో కొలువుల కోసం నగర యువత ఎదురుచూస్తోంది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులతోపాటు వివిధ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా కార్పొరేట్ కంపెనీల నియామక ప్రకటనలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వేచి చూస్తున్నారు. ‘రాబోయే రెండు మూడు నెలల్లో ఐటీ రంగంలో మళ్లీ బూమ్ రానుంది. కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయబోతున్నాయి. కార్పొరేట్ సెక్టార్లో జాబ్స్ భారీగా పెరుగుతాయి. ఐటీ రంగంలో 60 శాతం మేర రిక్రూట్మెంట్ పెరుగుతుందని భావిస్తున్నాం. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా ఐటీతో పోటీపడనున్నాయి. ఇప్పటికే రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా ఈసారి ముందుగానే మొదలవుతాయని భావిస్తున్నాం’ అని నెస్టార్ సోర్సింగ్ కన్సల్టెంట్ నిర్వాహకులు అజయ్ పడ్నేకర్ తెలిపారు. సుస్థిర ప్రభుత్వాలతో భరోసా: నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల సందడి. మరోవైపు రాష్ట్ర విభజన గందరగోళం. దాంతో కంపెనీలు రిక్రూట్మెంట్లను వాయిదా వేశాయి. గతంలో ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు సైతం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేందుకు సాహసించలేకపోయాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాంతో నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కంపెనీలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగానే హైరింగ్ ప్రక్రియ ప్రారంభించాయి. ఇప్పుడిప్పుడే ఐటీలో సీనియర్ లెవల్లో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయని ఆర్.సి.హెచ్.ఆర్ సొల్యూషన్స్ ప్రతినిధి వెల్లడించారు. భారీఎత్తున నియామకాలు జరపకపోయినా.. గతంతో పోల్చితే చాలా బెటర్‌గా ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. అవకాశాలను చేజిక్కించుకోవాలి: ‘‘గతేడాది కొత్త ఉద్యోగాల నియామకం పెద్దగా లేకపోవడం కుర్రకారు వేగానికి కళ్లెం వేసింది. ఐటీ కంపెనీల్లో ‘జంప్‌జిలానీ’ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కంపెనీల కోణంలో ఇది మంచి పరిణామమే. ఐటీ కొలువులకు చైనా పోటీ అనుకోవద్దు. ఆంగ్ల భాషపై మన హైదరాబాద్ విద్యార్థులకు మంచి పట్టుంది. మన విద్యార్థులు ఇంగ్లిష్‌ను చాలా త్వరగా నేర్చుకోగలరు. ఐటీ రంగం ఒక్కటే కాదు.. బ్యాంకింగ్ రంగంలోనూ బోలెడు ఉద్యోగ అవకాశాలు యువత ముందుకు వస్తున్నాయి. ఇంగ్లిష్‌ను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకుంటూ.. అందివస్తున్న అవకాశాలను చేజిక్కించుకోవడమే ఇప్పుడు యువతీ, యువకుల లక్ష్యం కావాలి’’ అంటూ విశ్లేషించారు ఇఫ్లూ రిటైర్డ్ ఆచార్యులు జి.ఎస్.ఆర్.కె.బాబూరావు. ముంబై, పుణె, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ భద్రతకు మారుపేరు. తక్కువ ఖర్చుతో ఉన్నతస్థాయి జీవనం గడిపే వీలున్న నగరం కావడం కూడా కంపెనీలు ఇక్కడకు రావడానికి మరో కారణం. కొత్త కంపెనీలు రావడం, ఇక్కడి కంపెనీలు కొత్త రాష్ట్రంలోనూ ఏర్పాటయ్యే నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు అమీర్‌పేటలోని ప్రముఖ కన్సల్టెన్సీ నిర్వాహకులు. కేవలం ఐటీకే పరిమితం కాకుండా.. మానవ వనరులు, ఆడిట్స్, అకౌంట్స్ తదితర విభాగాల్లోనూ నియామక ప్రక్రియ ఆశాజనకంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఐటీయేతర రంగాల్లోనూ అవకాశాలు: గతంతో పోల్చితే ఈ ఏడాది ఐటీ రంగం అధికంగా ఉద్యోగాలు కల్పిస్తుందని కాలేజీల ప్లేస్‌మెంట్స్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గత విద్యాసంవత్సరం అక్టోబర్‌లో రిక్రూట్మెంట్స్ ప్రారంభమయ్యాయి. అదీ కూడా అరకొరగానే! ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లోనే ఐటీ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్‌కు వస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ పరంగా ఇది శుభపరిణామం. ఐటీ రంగంలో ఈ దఫా ఉద్యోగావకాశాలు బాగా పెరుగుతాయనే భావిస్తున్నాం. మెకానికల్, సివిల్, ఫైనాన్స్ వంటి ఐటీయేతర రంగాలు ఆగస్టు తర్వాత రిక్రూట్మెంట్స్ మొదలుపెడతాయనే సమాచారం ఉంది అంటున్నారు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ వి.ఉమామహేశ్వరరావు. స్కిల్స్ పెంచుకుంటే మేలు: గతేడాది అక్టోబర్‌లో ఐటీ, ఐటీఈఎస్‌లో హైరింగ్ కేవలం 4 శాతం. కానీ ఈ ఏడాది అదే అక్టోబర్ నాటికి 15 శాతం పెరగొచ్చంటున్నారు ప్రముఖ కళాశాలల ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లు. బీపీఓ సెక్టార్లో 13 శాతం నుంచి 20 శాతం మేర రిక్రూట్మెంట్ ఉంటుందంటున్నారు. ఈ ఏడాది నియామకాల్లో ఐటీ, బీపీవో, బ్యాంకింగ్, ఫార్మా, టెలికాం రంగాల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉండబోతుందనేది నిపుణుల అంచనా. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు 50 వేల ఉద్యోగాలను కల్పించనున్నాయి. ఇటీవలే కరూర్ వైశ్యాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, సహకార బ్యాంకులు 10 వేల మంది ఉద్యోగులను నియమించేందుకు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఇప్పటివరకూ నింపాదిగా ఉన్న ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, ఆటోమొబైల్ రంగ సంస్థలు చేపట్టనున్న ‘హైరింగ్’లో జాబ్‌ను సొంతం చేసుకునే దిశగా అందుకు అవసరమైన స్కిల్స్‌తో యువత సిద్ధం అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.