మంచి హోదా కలిగిన కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరి కొందరూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆటుపోట్లను ఎదుర్కొంటారు. కొందరూ తగ్గేదేలా అంటూ కష్టపడి మరీ విజయశిఖరాలను చేరుకుంటారు. అయితే అందరూ ఈ సాహసం చేయలేరు. కొందరూ ఈ సాహసం చేసి మరీ విజయతీరాలకు చేరుకుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె ఏం వ్యాపారం చేసిందంటే..
వివరాల్లోకెళ్తే..29 ఏళ్ల వియన్నా హింట్జ్ అనే యూఎస్ మహిళ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైస్‌మెంట్‌కి సంబంధించిన కార్పొరేట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ పూల వ్యాపారం మొదలు పెట్టింది. ఆమె పూల వ్యాపారం విజయవంతమైన ఏకంగా నెలకు రూ. 13 లక్షలు ఆర్జిస్తోంది. ఆమె సైరాక్యూస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. న్యూయార్క్ నగరంలోని ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైస్‌మెంట్ విభాగంలో పనిచేసేదాన్ని అని తెలిపింది. ఐతే ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదని, ఏదో ఒకటి చేయాలన్నా ఆరాటంతో అసంతృప్తిగా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది.
ఆ క్రమంలో స్వంత డిజటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. అయినా ఏదో అసంతృప్తి వెంటాడేది. అప్పుడే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకున్నట్లు వివరించింది. ఆ థెరపిస్ట్ ఇష్టమైన ఉద్యోగాల జాబితాను రూపొందించి వాటిలో తనకు నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం చేయమని వియన్నాకు సలహ ఇచ్చింది. అప్పుడే వియన్నాకు తన స్నేహితులతోనూ, ప్రజలతో కలిసి పనిచేసే వ్యాపారం ఎంచుకోవాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నదే తడువుగా పాత పికప్ ట్రక్‌ని తెచ్చి అందులో స్వంతంగా పూల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ ట్రక్ పేరు మెయిన్ స్ట్రీట్ ట్రక్. వియన్నా 2023 నుంచి ఈ వ్యాపారం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె వ్యాపారం ఏడాదికి దాదాపు రూ.36 లక్షలు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
అంతేగాక రూ. 3 లక్షలకు పైగా లాభాలను ఆర్జించింది. కేవలం గత మే నెలలో సుమారు రూ. 13 లక్షలు సంపాదించినట్లు చెప్పుకొచ్చింది వియన్నా. పువ్వులు కాలానుగుణంగా ఉంటాయి కాబట్టి, ఆయా నెలల్లో ఇతరుల కన్నా ఎక్కువ డబ్బు ఆర్జించగలిగానని చెప్పుకొచ్చింది. అలాగే కొన్ని ముఖ్యమైన రోజులు వాలెంటైన్స్ డే, మదర్స్ డే వంటి సెలవుల్లో మాత్రం అమ్మకాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పింది. ఇక తాను ఈ వ్యాపారాన్నే ఎంచుకోవడానికి తన తల్లిదండ్రులే కారణమని అంటోంది. వియన్నా తండ్రి అగ్రిమాపక దళంలో పనిచేస్తారు.
అయితే ఆయన ఉద్యోగానికి పికప్ ట్రక్‌లో వెళ్లేవారని, అలాగే తన తల్లికి గార్డెనింగ్ అంటే ఇష్టమని అందువల్లే తాను ఇలా పికప ట్రక్‌లో పూల వ్యాపారం చేయాలని భావించినట్లు తెలిపింది. అంతేగాదు తనకు నచ్చిన పూల వ్యాపారం చేస్తూ..ఈ ట్రక్‌లో తన నాన్నతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ హయిగా వ్యాపారం చేస్తున్నాని చెబుతోంది. నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే ఎన్నో లాభాలు ఆర్జించొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు అని ప్రూవ్ చేసింది వియన్నా. అంతేగాదు తన ట్రక్‌కి తన కంపెనీ పేరు పెట్టాలనుకుంటున్నట్లు కూడా చెబుతోంది.
(చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?)
Comments
Please login to add a commentAdd a comment