వరల్డ్ స్ట్రీట్ ఫుడ్ | The Square novotel offers to make World street food | Sakshi
Sakshi News home page

వరల్డ్ స్ట్రీట్ ఫుడ్

Published Fri, Sep 5 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

వరల్డ్ స్ట్రీట్ ఫుడ్

వరల్డ్ స్ట్రీట్ ఫుడ్

పానీపూరీ, సమోసా చాట్, మిర్చీబజ్జీ, పావ్‌బాజీ... ఇవి హైదరాబాదీ వీధుల్లో నిరంతరం లభించే స్ట్రీట్‌ఫుడ్. ఇవే కాదు, వివిధ దేశాల్లో లభించే స్ట్రీట్‌ఫుడ్‌ను ది స్క్వేర్ నోవాటెల్ ప్రతి శుక్రవారం నగరవాసులకు అందిస్తోంది. అమెరికన్, యూరోపియన్, అరబిక్, మెక్సికన్ వెరైటీలైన చుర్రోస్, కుక్కీస్ క్రీమ్, లైవ్ సబ్‌వే, మినీ బర్గర్ స్టేషన్, క్వోసెల్లీడాస్, పోటిన్ వంటి రుచులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
 
 శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఉన్న ఈ హోటల్.. వీకెండ్‌లో సకుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపే ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. నగరంలోనే అతిపెద్ద జిమ్, స్పా, డిన్నర్ కోసం లైవ్ కిచెన్‌తో కూడిన ఇండియన్ రెస్టారెంట్, స్విమ్మింగ్‌పూల్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు ఇక్కడ దేశ విదేశీ అతిథులకు ఆహ్వానం పలుకుతాయి. ఈ హోటల్ శని, ఆదివారాల్లో వీకెండ్ ఫ్రెండ్లీ ప్యాకేజీలనూ అందిస్తోంది. ఈ ప్యాకేజీల్లో పిల్లలకు ఎలాంటి చార్జీలూ ఉండకపోవడం విశేషం.
 -  ఓ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement