యశస్వీ జైశ్వాల్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఒక యువ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు ఈ ముంబై బ్యాటర్. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టుతో డెబ్యూ చేసిన జైశ్వాల్.. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు.
సంచలన ఇన్నింగ్స్ ఆడిన జైశ్వాల్‌పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. కొంతమంది దిగ్గజ క్రికెటర్‌లు జైశ్వాల్‌ను ట్రినిడాడ్ యువరాజు, విండీస్ లెజెండ్ బ్రియాన్ లారాతో పోలుస్తున్నారు. ఇక జైశ్వాల్ ఈ స్ధాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందనే సంగతి తెలిసిందే. అయితే యశస్వీ క్రికెట్ ఫీల్డ్‌లో అదరగొట్టిన ప్రతీసారి.. అతడి పానీ పురీ స్టోరీ బయటకు వస్తోంది.
గతంలో యశస్వీ తన క్రికెట్ శిక్షణ కోసం పానీ పూరీలను విక్రయించేవాడని పలుసార్లు మనం వింటూ వస్తున్నాం. ఈ వార్తలను యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ తోసిపూచ్చాడు. జైస్వాల్ తన జీవనోపాధి కోసం ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదని అతడు చెప్పుకొచ్చాడు. జైస్వాల్ పానీపూరి స్టోరీపై జ్వాలా సింగ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.
అసలు నిజం ఇదే..
"మొదట్లో యశస్వీని ఇంటర్వ్యూ చేయమని చాలా మీడియా సంస్ధలను అడిగాను. కానీ ఎవరూ కూడా తన ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో నాకు చాల బాధ అనిపించింది. కానీ ఒక రోజు సడన్‌గా కొన్ని ప్రముఖ మీడియా సంస్ధలు నాకు తెలియకుండా జైశ్వాల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో నేను ఇంగ్లండ్‌లో ఉన్నాను. వారు జైశ్వాల్‌ను సంప్రదించగానే అతడు నాకు ఫోన్ చేశాడు.
కొంతమంది జర్నలిస్టులు తనను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారని నాతో చెప్పాడు. అందుకు నేను కూడా సరే అని అన్నాను. ఇంటర్వ్యూలో జైశ్విల్‌ను కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. అప్పుడు జైశ్వాల్ తన అమాయకత్వంతో పానీపూరీ సంఘటనను ప్రస్తావించాడు. అయితే జర్నలిస్టులు వారు స్టోరిలకు వెయిటేజీ ఇవ్వడం కోసం పానీపూరీ అంశాన్ని తమ హెడ్‌లైన్స్‌గా ఉపయోగించుకున్నారు. ఆ హెడ్‌లైన్స్ చూసి నేను షాక్ అయ్యా. ఎందుకంటే నేను అతడిని నా కొడుకులా పెంచి అన్ని సౌకర్యాలు కల్పించాను.
జైశ్వాల్ అద్భుతంగా ఆడిన ప్రతిసారీ, పానీపూరీ స్టాల్‌లో ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో బయటకు వస్తోంది. మీడియా సంస్థలు జైశ్వాల్ పక్కన ఉన్న వ్యక్తి తన తండ్రి అని ప్రచురిస్తాయి. అతడు జైశ్వాల్ తండ్రి కాదు. అది అనుకోకుండా దిగిన ఫోటో. జైశ్వాల్ తండ్రి ఎప్పుడూ జీవనోపాధి కోసం పానీపూరీలు అమ్మలేదు. జైశ్వాల్ కూడా ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదు. ఈ విషయాన్ని చాలా సార్లు తెలియజేశాం.
2013లో జైశ్వాల్ నాతో క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. జైశ్వాల్ ముంబైకి వచ్చిన మొదటిలో ఓ టెంట్‌లో నివసించేవాడు. ఆ సమయంలో కరెంటు,సరైన ఆహారం వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. వర్షాకాలంలో వారు వేసుకున్న టెంట్ నీటితో నిండిపోయేది. జైశ్వాల్ తన చిన్నతనంలో ఓ దుఖణాంలో పనిచేసేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి ప్రతి నెల రూ. 1000 రపాయలు పంపేవారు.
అయితే ఎప్పుడైతే అతడు నాతో క్రికెట్ శిక్షణను ప్రారంభించాడో అతడి కష్టాలు కొంతవరకు తీరాయి. గత 10 సంవత్సరాలుగా యశస్వినిని చూస్తున్నానని, U-19 ప్రపంచ కప్ 2020కి ముందు పానీపూరీ అమ్మినట్లుగా కథనాలు రాశారు. ఈ రకమైన స్టోరీలు అతనికి సహాయం చేసిన వ్యక్తులను కించపరుస్తాయి. అతడు ఈ స్ధాయికి చేరుకోవడానికి నేను నా వంతు కృషి చేశాను. నా జీవితంలో విలువైన 9 ఏండ్ల కాలన్ని యశస్వీకి ఇచ్చాను. అయితే చివరగా జైశ్వాల్‌ను ఈ స్ధాయిలో చూడడం చాలా సంతోషంగా ఉంది అని తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు
Comments
Please login to add a commentAdd a comment