రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌కు.. టీమిండియా తమ బ్యాటింగ్ పవర్ చూపించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు అలోవకగా ఛేదించింది. భారత విజయంలో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ కీలక పాత్ర పోషించారు.
లక్ష్య ఛేదనలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వీ జైశ్వాల్(84 నాటౌట్), శుబ్‌మన్ గిల్(77) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మైర్(61), షై హోప్(45) పరుగులతో రాణించారు. . భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, ముఖేష్ కుమార్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిచాడు.
వారిద్దరూ అద్భుతం..
"ఫోరిడాలో ఎక్కువ మంది భారత అభిమానులు మాకు సపోర్ట్ చేయడానికి స్టేడియంకు వచ్చారు. మేము వికెట్ తీసినా, బౌండరీలు బాదినా వారు చప్పట్లు కొట్టి మాకు మద్దతుగా నిలిచారు. మేము కూడా వారికి పూర్తిస్ధాయిలో క్రికెట్ మజాను అందించాము. ఇక ఈమ్యాచ్‌లో గిల్-జైశ్వాల్ ఆడిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వారిద్దరికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి.
వారు మ్యాచ్ ఫినిష్ చేసిన విధానం నన్నో ఎంతోగానో అకట్టుకుంది. ముఖ్యంగా జైశ్వాల్.. టీ20ల్లో కూడా తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో అతడి టాలెంట్ ఎంటో చూశాం. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ గెలవాలంటే మేము ఒక యూనిట్‌గా రాణించాలని నేను పదేపదే చెబుతున్నా.
బ్యాటింగ్ యూనిట్ బౌలర్లకు సపోర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే బౌలర్లు నిజమైన మ్యాచ్ విన్నర్లు. వారు ఒక రెండు వికెట్లు పడగొడితే చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఒక కెప్టెన్‌గా మా బాయ్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనే నేను ఆశిస్తాను. కెప్టెన్‌గా నా ఆలోచనకే తగ్గట్టే నేను ముందకు వెళ్లాలి అనుకుంటా. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి కాస్త నిరాశ చెందాము.
ఎందుకంటే తొలి మ్యాచ్‌ను చిన్నచిన్న తప్పిదాల వల్ల కోల్పోయాము. కానీ మేము ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ఈ రెండు మ్యాచ్‌ల విజయాలు మాకు చాలా కాన్ఫిడెన్స్ కలిగించాయి. ఆఖరి మ్యాచ్‌లో కూడా ఇదే దూకుడు కనబరిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జైశ్వాల్-గిల్ జోడీ.. ఐదేళ్ల తర్వాత!
Comments
Please login to add a commentAdd a comment