
ఫైల్ ఫోటో
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా తమ సన్నహాకాలను ప్రారంభంచింది. ఇందులో భాగంగా రెండు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు బీజీబీజీగా ఉంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన 8 మంది ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లు భాగమయ్యారు. కరేబియన్ పరిస్ధితులను ఆర్ధం చేసుకునేందుకు టీమిండియా ఈ వార్మాప్ మ్యాచ్‌లు ఆడుతోంది.
ఓపెనర్‌గా యశస్వీ జైశ్వాల్..
ఇక విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మనం సరికొత్త భారత ఓపెనింగ్ జోడిని చూసే అవకాశం ఉంది. భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మతో కలిసి యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగుతున్న వార్మాప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లగా బరిలోకి దిగారు.
ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో రోహిత్, జైశ్వాల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా రోహిత్ మంచి టచ్‌లో కన్పించడం జట్టుకు కలిసిచ్చే ఆంశం. అదే విధంగా యువ ఆటగాడు జైశ్వాల్ కూడా బౌండరీలు వర్షం కురిపించాడు.
మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జూలై 12 నుంచి డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: Virat Kohli: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
India's warm up match.
— Aniket (@anikkkett) July 5, 2023
Video Courtesy: Instagram/cricbarbados#IndianCricketTeam pic.twitter.com/ZawSnvYsqt