బార్బడోస్ వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వర్క్‌లోడ్ కారణంగా విండీస్‌తో వన్డే సిరీస్ నుంచి సిరాజ్‌ను బీసీసీఐ తప్పించింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లు జరగనుండడంతో సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే అతడు టెస్టు జట్టు సభ్యులు రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానే, కెఎస్ భరత్ వంటి సహచర ఆటగాళ్లతో స్వదేశానికి పయనమైనట్లు తెలుస్తోంది. కాగా విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిరాజ్ అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక తొలి వన్డేకు అతడి స్ధానంలో ముఖేష్ కుమార్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
భారత జట్టులోకి అర్ష్‌దీప్ సింగ్..
ఇక విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన సిరాజ్ స్ధానాన్ని యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో భర్తీ చేయాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అర్ష్‌దీప్ ప్రస్తుతం కరేబియన్ దీవుల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో వన్డే జట్టులో కూడా అతడిని చేర్చాలని రోహిత్, ద్రవిడ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అర్ష్‌దీప్ చివరగా 2022లో భారత్ తరపున వన్డేల్లో ఆడాడు. ఇప్పటివరకు మూడు వన్డేలు ఆడిన అర్ష్‌దీప్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో అద్బుతంగా రాణించడంతో మరోసారి అర్ష్‌దీప్‌కు పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: #Shai Hope: అతడు తిరిగొచ్చాడు.. మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం.. గెలుపు మాదే!: విండీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment