
డొమినికా వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. సోమవారం(జూలై 10)తో ఇరు జట్లు కూడా తమ ప్రాక్టీస్‌ను ముగించాయి. ఈ క్రమంలో తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు రిలాక్స్ అవుతున్నారు.
ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం డొమినికా వీధుల్లో చక్కెర్లు కొడుతున్నాడు. స్వయంగా తనే కారు డ్రైవ్ చేస్తూ కరీబియన్ దీవుల అందాలను అశ్విదిస్తున్నాడు. కారులో రోహిత్‌తో పాటు సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జర్నలిస్ట్ విమల్ కుమార్ తన కెమెరాలో బంధించాడు. అనంతరం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్‌తో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు:
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
చదవండి: ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే?
Rohit Sharma’s drive off the field 😊 pic.twitter.com/sH5tm4JVpm
— Vimal कुमार (@Vimalwa) July 11, 2023
Comments
Please login to add a commentAdd a comment