వెస్టిండీస్‌తో జరుగుతన్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను మించిపోయింది. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్‌లో టీమిండియాకు ఓపెనర్లు ఘనమైన ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు.
అనంతరం శుబ్‌మన్ గిల్(29), ఇషాన్ కిషన్( 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కిషన్ కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇదే తొలి టెస్టు హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
శ్రీలంక వరల్డ్ రికార్డు బ్రేక్..
ఈ క్రమంలో టెస్టుల్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. విండీస్‌తో రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2001లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో శ్రీలంక 13.2 ఓవర్లలో వంద పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో శ్రీలంక రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.
విజయానికి 8 వికెట్ల చేరవలో..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్‌వుడ్(20) పరుగులతో ఉన్నారు.
చదవండి: MLC 2023: పూరన్ ఊచకోత.. 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో! ముంబై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment