గయానా వేదికగా వెస్టిండీస్‌తో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. మంగళవారం విండీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైతే సిరీస్‌ను కోల్పోతుంది. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ ఇప్పటికే 2-0 అధిక్యంలో ఉంది. దీంతో ఈ కీలక మ్యాచ్‌లో సరైన కాంబనేషన్‌తో బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి, యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తొలి రెండు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజూ వికెట్ కీపింగ్ బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.
కుల్దీప్ జట్టులోకి వస్తే మరో స్పిన్నర్ బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితమవ్వల్సి వస్తుంది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా అకట్టుకోపోయిన ముఖేష్ కుమార్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను అవకాశం ఇవ్వాలని హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్ సిరీస్‌పై కన్నేసింది. మూడో టీ20లో ఎటువంటి మార్పులు లేకుండా విండీస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక విండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్‌ను భారత బౌలర్లు ఎంతవరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది.
తుది జట్లు(అంచనా)
భారత్: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్
విండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
చదవండి: Global T20 Canada: ఇదెక్కడి అవార్డురా బాబు?.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర ఎకరం భూమి
Comments
Please login to add a commentAdd a comment