యశస్వీ జైశ్వాల్.. భారత క్రికెట్‌లో యువ సంచలనం. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఈ 21 ఏళ్ల ముంబైకర్. అరంగేట్ర టెస్టులోనే అద్బుత సెంచరీతో క్రికెట్ ప్రపంచానికి తన పేరును పరిచయం చేసుకున్నాడు. సాంప్రాదాయ క్రికెట్‌లో తన అగమనాన్ని ఘనంగా చాటుకున్న యశస్వీ.. ఇప్పుడు టీ20ల్లో కూడా తన మార్క్‌ను చూపించాడు.
గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20తో డెబ్యూ చేసిన జైశ్వాల్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడికి నాలుగో టీ20లో చోటు దక్కదని, మళ్లీ ఇషాన్ కిషన్‌ను తీసుకువస్తారని అంతా భావించారు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం అతడిపై నమ్మకం ఉంచి ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో కూడా అవకాశం ఇచ్చాడు.
హార్దిక్ నమ్మకాన్ని జైశ్వాల్ వమ్ము చేయలేదు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 11 ఫొర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా అతడి అద్భుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై యశస్వీ జైశ్వాల్ కీలక వాఖ్యలు చేశాడు.
"టీ20 ఫార్మాట్‌లో ఆడటం అంత సులభం కాదు. కానీ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటడంచాలా సంతోషంగా ఉంది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించాను. ముఖ్యంగా నాకు ఎంతో మద్దతుగా నిలిచిన సపోర్ట్ స్టాప్, హార్దిక్ భాయ్‌కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
తొలి మ్యాచ్‌లో విఫలమైనా నాపై చాలా నమ్మకం ఉంచారు. అది నాపై చాలా ప్రభావం చూపుతుంది. జట్టుకు ఏం కావాలో చూసి.. దానికి తగ్గట్లు ఆడేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. అదే సమయంలో నన్ను నేను ప్రూవ్ చేసుకోనేందుకు కూడా ప్రయత్నిస్తాను. వికెట్‌ను అర్ధం చేసుకుని త్వరగా పరుగులు సాధించడానికి ట్రై చేస్తాను. పవర్‌ప్లేలో జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడమే నా టార్గెట్.
ఇక నేను ఐపీఎల్‌లో హోల్డర్, మెకాయ్ బౌలింగ్‌ను చాలా సార్లు ఎదుర్కొన్నాను. అది ఈ మ్యాచ్‌లో నాకు ఉపయోగపడింది. అదే విధంగా గిల్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది. గిల్ చాలా బాగా ఆడాడు. అతడు స్ట్రైక్ రోటాట్ చేసిన విధానం అద్భుతం. ఇక ఆఖరిగా నాకు మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు" అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో జైశ్వాల్ పేర్కొన్నాడు.
Yashasvi Jaiswal 🗣️on his 1st T20I 5️⃣0️⃣.
— RevSportz (@RevSportz) August 13, 2023
Here's the full press conference.
Listen in 👇.@Wowmomo4u #WIvIND #YashasviJaiswal pic.twitter.com/G2XZgJvdPn
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! స్పీడ్ స్టార్‌కు ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment