Actress Kamya Punjabi Forget Rs 1 Lakh At Pani Puri Stall In Indore: పానీపూరి పేరు వింటే చాలు మైమరిచిపోతారు అమ్మాయిలు. వారికి ఇది ఎంతో ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. పానీపూరిని తింటూ లోకాన్నే మరిచిపోతారు అమ్మాయిలు. ఈ విషయంలో సాధారణ యువతులే కాదు సెలబ్రిటీలేం అతీతం కాదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ పానీపూరి మైకంలో ఏకంగా లక్ష రూపాయలను అక్కడే మరిచిపోయి వచ్చింది ఓ నటి. ఆ నటి ఎవరో కాదు కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి తదితర హిట్ సినిమాల్లో నటించిన కామ్య పంజాబీ. ఆమె ఇటీవల ఇండోర్‌కు వెళ్లిన కామ్య ఓ ఈవెంట్లో పాల్గొంది. అక్కడ బయటకు వెళ్లి పానీపూరిలను ఓ పట్టు పట్టింది.
పానీపూరిలు ఆస్వాదిస్తూ అక్కడ టేబుల్‌పై రూ. లక్ష ఉన్న ఎన్వలప్ కవర్‌ను పెట్టింది. తర్వాత అక్కడ ఫొటోలు తీస్తూ తీస్తూ ఆ ఎన్వలప్‌ను అక్కడే మరిచిపోయి హోటల్‌కు తిరిగివెళ్లింది. హోటల్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఎన్వలప్‌ను మరిచిపోయిందనే సంగతి గుర్తుకు వచ్చి తన మేనేజర్‌ను పంపించదట. తాను మరిచిపోయిన చోటుకు వెళ్లిన కామ్య మేనేజర్ ఆ ఎన్వలప్‌ను తిరిగి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎన్వలప్ మరిచిపోయిన సమయంలో తీవ్ర ఒత్తిడిగి గురైనట్లు కామ్య తెలిపింది. 'నిజానికి ఆ డబ్బు దొరకదనుకున్నాను. అంత రద్దీ ప్రదేశంలో విలువైన ఎన్వలప్ దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు, దయగలవారు.' అని కామ్య పంజాబీ తెలిపింది.
చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment