forgotten
-
నిరుపేదలు, మధ్యతరగతిని మర్చిపోయిన కేంద్రం: రాహుల్
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు. -
కాలంలో కలిసిపోయిన జావా & యెజ్డీ బైకులు (ఫోటోలు)
-
మరుగున పడిన అద్భుతమైన మహీంద్రా వాహనాలు (ఫోటోలు)
-
బిడ్డను తీశారు.. కత్తెర మరిచారు.. ఆరేళ్ల తర్వాత!
కోల్‌సిటీ(రామగుండం): ప్రసవం చేయమని డాక్టరుని వేడుకుంటే..సిజేరియన్ ద్వారా కడుపులో బిడ్డను తీసి..కత్తెర ఉంచి కడుపు కుట్టేశారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధితురాలు ఆరేళ్లుగా నరకయాతన అనుభవించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో 2017 ఏప్రిల్ 15న చేరింది. మరుసటిరోజు ఆస్పత్రిలోని సీనియర్ గైనకాలజిస్టు సిజేరియన్ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. అయితే సిజేరియన్ అనంతరం మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసి వారం తర్వాత ఇంటికి పంపేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో ఉంటున్న సదరు మహిళకు మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం దాల్చలేదు. కడుపునొప్పితోపాటు తరుచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుండటంతో రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎక్స్‌రే తీయించగా...ఆమె కడుపులో కత్తెర ఉందని వైద్యులు నిర్ధారించారు. పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్న వైద్యురాలు బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్ చేసిన గైనకాలజిస్టును నిలదీయడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రాజీ కుదుర్చురోవాలని వైద్యురాలు వేడుకున్నారు. బాధితురాలి కడుపులో కత్తెర తీసేందుకు చేసే శస్త్రచికిత్సకు ఖర్చును తానే భరించడంతోపాటుగా రూ.3.50లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో అందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డబ్బులిచ్చి ఆ మహిళను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. దీనిపై వైద్యురాలిని వివరణ అడగగా..ఆపరేషన్ సమయంలో పొరబాటు జరిగి ఉండొచ్చని చెప్పారు. కాగా, కడుపులోనే కత్తెర మర్చిపోయిన గైనకాలజిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్ డిమాండ్ చేశారు. -
పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి..
Actress Kamya Punjabi Forget Rs 1 Lakh At Pani Puri Stall In Indore: పానీపూరి పేరు వింటే చాలు మైమరిచిపోతారు అమ్మాయిలు. వారికి ఇది ఎంతో ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. పానీపూరిని తింటూ లోకాన్నే మరిచిపోతారు అమ్మాయిలు. ఈ విషయంలో సాధారణ యువతులే కాదు సెలబ్రిటీలేం అతీతం కాదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ పానీపూరి మైకంలో ఏకంగా లక్ష రూపాయలను అక్కడే మరిచిపోయి వచ్చింది ఓ నటి. ఆ నటి ఎవరో కాదు కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి తదితర హిట్ సినిమాల్లో నటించిన కామ్య పంజాబీ. ఆమె ఇటీవల ఇండోర్‌కు వెళ్లిన కామ్య ఓ ఈవెంట్లో పాల్గొంది. అక్కడ బయటకు వెళ్లి పానీపూరిలను ఓ పట్టు పట్టింది. పానీపూరిలు ఆస్వాదిస్తూ అక్కడ టేబుల్‌పై రూ. లక్ష ఉన్న ఎన్వలప్ కవర్‌ను పెట్టింది. తర్వాత అక్కడ ఫొటోలు తీస్తూ తీస్తూ ఆ ఎన్వలప్‌ను అక్కడే మరిచిపోయి హోటల్‌కు తిరిగివెళ్లింది. హోటల్‌కు వెళ్లిన కొద్దిసేపటికే ఎన్వలప్‌ను మరిచిపోయిందనే సంగతి గుర్తుకు వచ్చి తన మేనేజర్‌ను పంపించదట. తాను మరిచిపోయిన చోటుకు వెళ్లిన కామ్య మేనేజర్ ఆ ఎన్వలప్‌ను తిరిగి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎన్వలప్ మరిచిపోయిన సమయంలో తీవ్ర ఒత్తిడిగి గురైనట్లు కామ్య తెలిపింది. 'నిజానికి ఆ డబ్బు దొరకదనుకున్నాను. అంత రద్దీ ప్రదేశంలో విలువైన ఎన్వలప్ దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు, దయగలవారు.' అని కామ్య పంజాబీ తెలిపింది. చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్ ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ -
ఎంత సక్కగున్నావే.. రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మన జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే శానిటైజర్ల వాడకం, మాస్క్‌ల వినియోగం, భౌతిక దూరం పాటించడం లాంటివి దినచర్యల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ప్రత్యేకంగా మాస్క్ అనేది తప్పనిసరిగా మారిందనే చెప్పాలి. ఏది మరచిపోయిన పర్లేదు కాని మాస్క్ మాత్రం మరిచిపోవద్దు. ఇక తారల విషయానికొస్తే వారి ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల నటి రష్మిక ఓ ప్రదేశానికి వెళ్లారు. కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఈ ముద్దు గుమ్మ కొన్ని సెకన్ల తర్వాత మాస్క్ పెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే వెనక్కి వెళ్లి మాస్క్ పెట్టేసుకుంది. ప్రధానంగా మాస్క్ లేదని రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కన్నడ, హిందీ భాషలలోను సినిమాలు చేస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బెజవాడలో గజినిలు
గజిని సినిమాలో మెదడుకు దెబ్బతగిలి కథానాయకుడు గతాన్ని మర్చిపోతాడు. జ్ఞాపకాలను మననం చేసుకునేందుకు పడే అవస్థలు.. ఉపయోగించే చిట్కాలతో కథనం సాగుతుంది. ప్రస్తుతం నగరవాసంలో మతిమరుపు బాధితులు (గజినిలు) పెరిగిపోతున్నారు. విజయవాడ నగరంలో యువతలో రోజు రోజుకు ఈ సమస్య తీవ్రమవుతుండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు, పరీక్షల భయం, ఆందోళనలు ఈ సమస్యలకు కారణాలుగా మానసిక వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం, మెదడుకు వ్యాయామంతో ఈ సమస్యను అధిగమించవచ్చని పేర్కొంటున్నారు. లబ్బీపేట (విజయవాడతూర్పు): స్కూల్‌కు టైం అయిపోతుందనే హడావుడిలో మమ్మీ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోయే పిల్లలు.. ఆఫీస్‌కు లేట్ అవుతున్నామనే భయంతో బైక్ కీస్ మరిచి మెట్లు దిగిపోయే ఉద్యోగులు.. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో పడి చేయాల్సిన పని మర్చిపోతున్న యువకులు ఇలా.. విజయవాడ నగరంలో ఇప్పుడు మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 14 ఏళ్లకే వచ్చేస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తుందంటే నమ్మక తప్పదు. పరీక్షల భయం, పని ఒత్తిడి ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు కాగా, పౌష్టికాహారలోపం, కొన్ని రకాల రోగాలు ఇందుకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్‌లో బీజం మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. ఇది నిజం. 25–35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్ర స్థాయికి చేరుతోంది. వైద్య నిపుణులు చెబుతున్న మాట ఇదే. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామని తెలియక ఏదో సమస్యతో వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. అంతుచూస్తున్న ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జ్జయిటీ, సైకలాజికల్ అంశాలు మెమరీ పవర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత ఇప్పుడు జుట్టు పీక్కుంటోంది. ఉదయం లేవగానే ఏదో పనిచేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా మైండ్ పట్టుతప్పుతోంది. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. అది మనసుపై ప్రభావం చూపుతుంది. లోపిస్తున్న ఏకాగ్రత ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలో యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదాన్ని మనసులో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులొస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోకపోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గుర్తుంచుకున్నట్లుగా ఉంటుంది.. కాని గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినకపోవడంతో తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. బీపీ, మధుమేహం ప్రభావం మధుమేహం, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బి–12 కారణమని, దాని లోపం వల్ల మతి మరుపు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏకాగ్రత తగ్గుతోంది యువత, విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోంది. దీంతో చేయాల్సిన దానిపై దృష్టి సారించలేక పోతున్నారు. ప్రతి చిన్న విషయానికి వస్తువులపై ఆధారపడటం, అంటే లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడటం, ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడపడం వంటివి. వీటి వల్ల ప్రతి విషయాన్ని మరిచిపోవడం జరుగుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరూ బ్రెయిన్‌తో ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లలపై మార్కులు కోసం ఒత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది.–డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ప్రభుత్వాస్పత్రి బెజవాడలో ‘గజని’లు ‘వీడు మతిమరుపునకు బ్రాండ్ అంబాసిడర్’.. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరో గురించి హీరోయిన్ తండ్రి చెప్పిన మాటలివి. మతిమరుపుతో బాధపడే వ్యక్తిగా హీరో కష్టాలు, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టం అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది. ఏ మాత్రం శారీరక శ్రమలేని యాంత్రిక జీవనం.. మనిషి నడవడికను పూర్తిగా మార్చేస్తోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్ల వాడకం పెరిగి ప్రతి సమాచారానికీ వాటిపైనే ఆధారపడుతుండడంతో క్రమంగా మెదడు పదును తగ్గుతోంది. వెరసి యువతలో మతిమరుపు సమస్య తీవ్రతరమవుతోంది. -
ఏవీ గుర్తుండవు!
మతి మరుపు సమస్య పెనుసవాల్‌గా మారింది. స్కూల్ పిల్లల వద్ద నుంచి ఉద్యోగులు. యువతలో రోజురోజుకూ ఈ సమస్య తీవ్ర తరమవుతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మతిమరుపు సమస్యకు తీవ్రమైన వత్తిళ్లు, పరీక్షల భయం, ఆందోళనలు కారణంగా చెపుతున్నారు. దీనిపై కథనం... లబ్బీపేట (విజయవాడ తూర్పు): స్కూల్‌కి టైమ్ అయిపోతుందనే హడావుడిలో మమ్మీ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోయే పిల్లలు...ఆఫీస్‌కు లేట్ అవుతున్నామనే భయంతో బైక్కీస్ మరిచి గబగబా మెట్లు దిగిపోయే ఉద్యోగులు.. టీం లీడర్‌తో మీటింగ్ ఉంది.. ఫైల్ ప్రిపేర్ చేయాలంటూ హడావిడిలో ఇంటి వద్దనే డెస్క్కీస్ మరిచి పోయే మార్కెటింగ్ ఉద్యోగులు ఇలా.. వీళ్లే కాదండి బాబూ నగరంలో ఇప్పుడు ఇలా మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 16 ఏళ్లకే వచ్చేస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తుందంటే నమ్మక తప్పదు. పరీక్షల భయం, పనివత్తిడి ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు కాగా, పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు ఇందుకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. టీనేజ్‌లో బీజం మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. ఔను ఇది నిజం. ఇక 25–35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్రస్థాయికి చేరుతోంది. వైద్య నిపుణులు చెపుతున్న మాట ఇదే. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామని తెలియక ఏదో సమస్యతో వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించ గలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. ఏకాగ్రతే ప్రధాన లోపం ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలో యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్న దానిని మనసులో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులోస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోక పోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుర్తుంచుకున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరొకరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినకపోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి. అంతు చూస్తున్న ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జాయిటీ, సైకాలజికల్ అంశాలు మెమరీ పవర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత ఇప్పుడు జుట్టు పీక్కుంటోంది. ముఖ్యమైన అంశాలను గుర్తు పెట్టుకోవడంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఏదో పని చేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా మైండ్ పట్టు తప్పుతోంది. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలున్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్లు అభివృద్ధిలో లోపాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆనందంగా ఉండాల్సింది పోయి, మానసికంగా మందకొడిగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బి–12 కారణమని, దానిలో లోపం వల్ల మతిమరుపు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి లోపిస్తుందని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికెళ్లకూడదని, బీ12 నాన్‌వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా పచ్చని ఆకు కూరగాయలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జాయిటీ. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వలన స్ట్రెస్ పెరిగిపోతుంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దాంతో విన్న విషయం గుర్తుకు రాకపోవడం జరుగుతోంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్ధిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, పరీక్షల మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో వత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణం అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. మెదడుకు పదును పెట్టండి మతిమరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. సకాలంలో సరైన జవాబు మన వద్ద లేక పోవడమే దీనికి కారణం. ప్రతి చిన్న విషయానికి వస్తువులపై ఆధారపడటం.. అంటే లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడటం, ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడపడం వంటివి. వీటి వలన ప్రతి విషయాన్ని మరిచిపోవడం జరుగుతుంది. మతి మరుపునకు ఇదీ ఒక కారణం. ఒత్తిడిని జయిం చేందుకు ప్రతి ఒక్కరూ బ్రెయిన్‌కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతిమరుపు తగ్గే అవకాశాలుంటాయి. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవస రం. తల్లిదండ్రులు పిల్లలపై మార్కులు కోసం వత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. –డాక్టర్ ఆర్కే అయోధ్య,మానసిక వైద్య నిపుణులు -
కారులో మరిచిన తండ్రి: బాలుడి మృతి
అబుదాబి: ఓ నాలుగేళ్ల బాలుణ్ని తండ్రి కారులో మరచిపోవడంతో ఊపిరాడక మరణించిన ఘటన షార్జాలోని అల్ రమ్ సా ప్రాంతంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తండ్రి -కొడుకులు ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వచ్చారు. అయితే కొడుకు కారు వెనుక సీట్లో ఉన్న విషయాన్ని తండ్రి మరిచిపోయాడు. ఆ బాలుడు తనతో ఉన్న విషయాన్ని మరిచిపోయిన తండ్రి కారును పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు. అదే సమయంలో కారును కూడా లాక్ చేశాడు. కారు లోపల ఊపిరాడక పిల్లాడు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కొడుకు కారులోనే ఉన్న విషయం ఉన్నట్టుండి గుర్తుకొచ్చిన తండ్రి.. పరుగున కారు దగ్గరకు వెళ్లి, పిల్లాడిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆ పిల్లాడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు షార్జా పోలీసులు శనివారం తెలిపారు. ఈ తరహా ఘటనలో గత సంవత్సరం ఐదుకు పైగా చోటు చేసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమ పిల్లల్ని కారులో మరిచిపోవడం తో పాటు ఇంజిన్ ను ఆన్ లో ఉంచడంతోనే లోపల వేడి ఎక్కువై ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.