కారులో మరిచిన తండ్రి: బాలుడి మృతి | Forgotten by father, child dies in locked car | Sakshi
Sakshi News home page

కారులో మరిచిన తండ్రి: బాలుడి మృతి

Published Sat, Jul 11 2015 4:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

కారులో మరిచిన తండ్రి: బాలుడి మృతి

కారులో మరిచిన తండ్రి: బాలుడి మృతి

అబుదాబి: ఓ నాలుగేళ్ల బాలుణ్ని తండ్రి కారులో మరచిపోవడంతో ఊపిరాడక మరణించిన ఘటన షార్జాలోని అల్ రమ్ సా ప్రాంతంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

 

తండ్రి -కొడుకులు ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వచ్చారు.  అయితే కొడుకు కారు వెనుక సీట్లో ఉన్న విషయాన్ని తండ్రి మరిచిపోయాడు. ఆ బాలుడు తనతో ఉన్న విషయాన్ని మరిచిపోయిన తండ్రి కారును పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు.  అదే సమయంలో కారును కూడా లాక్  చేశాడు. కారు లోపల ఊపిరాడక పిల్లాడు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కొడుకు కారులోనే ఉన్న విషయం ఉన్నట్టుండి గుర్తుకొచ్చిన తండ్రి.. పరుగున కారు దగ్గరకు వెళ్లి, పిల్లాడిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆ పిల్లాడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు షార్జా పోలీసులు శనివారం తెలిపారు. ఈ తరహా ఘటనలో గత సంవత్సరం ఐదుకు పైగా చోటు చేసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమ పిల్లల్ని కారులో మరిచిపోవడం తో పాటు ఇంజిన్ ను ఆన్ లో ఉంచడంతోనే లోపల వేడి ఎక్కువై ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement