Tiger Shroff Mother Ayesha Employee lakhs Money Robs - Sakshi

టైగర్ ష్రాఫ్ తల్లికి షాకిచ్చిన ఉద్యోగి

Jun 9 2023 6:15 PM | Updated on Jun 9 2023 6:41 PM

Tiger Shroff Mother Ayesha Employee lakhs Money Robs - Sakshi

బాలీవుడ్‌ వెటరన్‌ స్టార్‌ హీరో  జాకీ ష్రాఫ్‌ భార్య, టైగర్‌ ష్రాఫ్‌ తల్లి అయేషా ష్రాఫ్‌ను అలెన్‌ ఫర్నాండో అనే వ్యక్తి రూ.58 లక్షలకు మోసం చేశాడు. ఈ మేరకు అయేషా ష్రాఫ్‌  ముంబయ్‌లోని శాంటాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది.  ఫెర్నాండెజ్‌పై సెక్షన్ 420, 408, 465, 467, 468 సెక్షన్స్‌ కింద కేసు నమోదు చేశారు. నవంబర్‌ 20, 2018న MMA మ్యాట్రిక్స్ అనే జిమ్‌ కంపెనీని టైగర్‌ ష్రాఫ్‌ తన సోదరితో కలిసి స్టార్ట్‌ చేశాడు.

(ఇదీ చదవండి: నాగార్జున సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్‌ చేసిన డైరెక్టర్‌)

అక్కడ  ఆపరేషన్స్ డైరెక్టర్‌గా అలెన్‌ ఫర్నాండోను వారు నియమించారు. టైగర్ ష్రాఫ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల దాని బాధ్యతలను  తల్లి అయేషా చూసుకుంటుంది. MMA మ్యాట్రిక్స్ ద్వారా పలు టోర్నమెంట్‌లను నిర్వహించడం కోసం కొందరి నుంచి రూ.58 లక్షలు తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. అలెన్‌ ఫర్నాండోను ముంబయ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.  

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement