'ఐస్‌క్రీమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా గుర్తింపును సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత 'లవర్స్', 'మనం', 'హార్ట్ ఎటాక్' సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే 2018లో వచ్చిన బిగ్‌బాస్-2లో పాల్గొన్న అనంతరం తేజస్వి పలు విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా కౌశల్‌తో ప్రవర్తించిన తీరుతో ట్రోల్స్ బారిన పడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంది.
ఆ తర్వాత కారణాలు ఏవైనా సినిమా ఆఫర్లు మాత్రం తగ్గుతూ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొనే తేజస్వీ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. 'చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్ అయ్యాను' అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. కొంపదీసి ఆ బండిని మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని గ్రహించాను : తేజస్వి
Published Tue, Jul 13 2021 12:54 PM | Last Updated on Tue, Jul 13 2021 2:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment