
సాక్షి, ముంబై: పానీ పూరీ అంటే చాలామంది అమ్మాయిలు లొట్టలేసుకుంటూ తింటారు. లాక్‌డౌన్ కాలంలో కూడా పానీ పూరీకోసం ఎగబడిన దృశ్యాలను చూశాం. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీ లేదా గోల్ గప్పా కున్న స్పెషాల్టీ అది. కానీ పానీ పూరీ కిరీటం పెట్టుకున్న పెళ్లికూతుర్ని మాత్రం ఎక్కడా చూడ లేదు. అందుకే ఈ పానీ పూరీ స్పెషల్ పెళ్ళి కూతురి వీడియో వైరల్‌గా మారింది.
సాధారణంగా పెళ్లి అనగానే కాబోయే పెళ్ళి కూతుళ్ల హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి చీరలు, డిజైనర్ బ్లౌజ్‌లు, వీటన్నింటికీ మించి వారు ధరించే నగలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కానీ ఒక ఈ వధువు మాత్రం పానీ పూరిపై ప్రేమను తెలిపేందుకు మరో అడుగు ముందుకేసింది. సాధారణ నగలతో పాటు ఏకంగా పానీ పూరీ నగల్ని ధరించింది. వెరైటీ పానీపూరీ నగలతో ఉన్న నవ వధువును బంధువులు సరదాగా ఆటపట్టిస్తోంటే సిగ్గుతో ఆమె చిరునవ్వులు చిందించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. వాస్తవానికి ఒక బ్రైడల్ మేకప్ సంస్థ ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే అనూహ్యంగా ఈ వీడియోలోని పానీ పూరీలు హైలైట్ కావడం విశేషం.
లక్షా పదివేలకు పైగా లైక్స్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఔరా! గోల్ గప్పా ప్రేమా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరికొందరైతే తామూ కూడా ఫాలో అవుతాం.. తామూ ఇలాగే చేస్తామంటూ మురిసిపోతూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment