
చిరు వ్యాపారుల కోసం గుంటూరు ఎమ్మెల్యే రాస్తారోకో
గుంటూరు : చిరు వ్యాపారులపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఎమ్యెల్యే ముస్తఫా రాస్తోరోకోకు దిగారు. శుక్రవారం నగరంలోని హిమనీ సెంటర్‌లో పలువురు నేతలతో కలిసి ఆయన రాస్తోరోకోలో పాల్గొన్నారు.
విషయం తెలిసిన లాలాపేట సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఎమ్యెల్యేతో మంతనాలు జరపగా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం ఎమ్మెల్యే గుంటూరు అడిషినల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేతోపాటు వెళ్లారు.