సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణాల పంపిణీలో తెలంగాణ దేశంలోనే నంబర్ స్థానంలో నిలిచింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 3.4 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా, 3.57 లక్షల మంది (105 శాతం)కి రూ.357.61 కోట్ల రుణాలు మంజూరు చేశారు.
ఈ పథకం అమలుపై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్ర.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, డైరెక్టర్ ఎన్.సత్యనారాయణలను అభినందించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని వీధి వ్యాపారులు ఇప్పటి వరకు రూ.35.03 లక్షల క్యాష్ బ్యాక్‌ను పొందారు. మొత్తం దేశంలో పంపిణీ చేసిన క్యాష్ బ్యాక్‌లో 37 శాతాన్ని తెలంగాణ వీధి వ్యాపారులు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment