
వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి
మెప్మా పీడీ త్రినాథరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వీధి వ్యాపారులు ఎదుర్కొనే ట్రాఫిక్, ఈ-పాస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టణపేదరిక నిర్మూలన ప్రాజెక్టు డెరైక్టర్ త్రినాథరావు తెలిపారు. స్థానిక క్రాంతి భవన్‌లో రంధి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఏపీ వీధి విక్రయదారుల కార్మికఫెడరేషన్ జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతో వీధి విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సంఘ రాష్ట్ర కన్వీనర్ తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు సర్వేచేసిన వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, హాకర్స్ జోన్‌స షెడ్‌లు నిర్మించాలని కోరారు. సిటీ అభివృద్ధిలో 2 శాతం భూమి హాకర్ జోన్‌కి ఏర్పాటు చేయాలని, టౌన్ కమీటీ ఆధ్వర్యంలో వ్యాపార అభివృద్ధికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణం రాజు మాట్లాడుతూ ప్రైవేటు ఇన్సూరెన్‌స విధానాన్ని రద్దుచేయాలని, వీధి విక్రయదారుల బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. 60 సం వత్సరాలు దాటిన వీధి విక్రయదారులకు నెలకు రూ.3 వేలు చొప్పున పింఛన్ మం జూరు చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాపర వెంకటరమణ, జిల్లా కార్యదర్శి దొండపాటి నవీన్, జిల్లా గౌరవాధ్యక్షుడు కీర్తి సూర్యనారాయణ, న్యాయ సలహాదారుడు కూన అన్నంనాయుడు, డ్వాక్రా గ్రూప్ జిల్లా కన్వీనర్ పట్ట ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
వీధి విక్రయదారుల కార్మికఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడిగా నందిపల్లి సత్యం, అధ్యక్షుడిగా సమిటి దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా రంధి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కె.రాజు, సహాయ కార్యదర్శిగా గొర్లె గోపి, కోశాధికారిగా పట్ట ప్రభావతి, గౌరవ సలహాదారుడిగా చాపర వెంకటరమణ, న్యాయ సలహాదారుడిగా కూన అన్నం నాయడు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కోరాడ లక్ష్మి, తారబొడియన్, బొమ్మాళి పుష్పవతి, దాసరి సూరిబాబు ఎన్నికయ్యారు.