'వీధి వ్యాపారులు పేర్లు నమోదు చేసుకోవాలి' | DC pankaja appeals street vendors to be registered | Sakshi
Sakshi News home page

'వీధి వ్యాపారులు పేర్లు నమోదు చేసుకోవాలి'

Published Mon, Dec 5 2016 5:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

DC pankaja appeals street vendors to be registered

హైదరాబాద్: ఎల్‌బీ నగర్ సర్కిల్ 3ఏ పరిధిలోని నాగోలు, మన్సురాబాద్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ల పరిధిలోని వీధి వ్యాపారులు అందరు ఈ నెల 15వ తేదీ లోపు తమ పేర్లను ఈ-సేవా పక్కన ఉన్న బీఎన్‌రెడ్డినగర్ వార్డు కార్యాలయంలో నమోదు చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ పంకజ తెలిపారు. వీధి వ్యాపారులు తాము చేస్తున్న వ్యాపార వివరాలతో పాటు ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టుసైజ్‌ ఫోటో, 14సంవత్సరాలపై బడిన వారితో కుటుంబసభ్యుల పోటో, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, రేషన్‌ కార్డు లేదా కరెంటు బిల్లు జిరాక్స్‌లను జతచేయాలని ఆమె సూచించారు.
 
పేర్లను నమోదు చేయని వారిని వ్యాపారం చేసే అర్హత ఉండదని చెప్పారు. పేర్లు నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. పేర్లను నమోదు చేసుకోవడం వల్ల వీధి వ్యాపారం చేసుకునే సర్టిఫికెట్, గ్రూపులుగా చేయడం, బ్యాంకులతో అనుసంధానం చేసి రుణాలు ఇప్పించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని డీసీ పంకజ తెలిపారు. ఇతర వివరాల కోసం సర్కిల్ యూడీసీ సెక్షన్ అధికారి యూసుఫ్‌ ను 9989337898లో సంప్రదించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement