సాక్షి, ప్రత్యేకం : మరికొద్ది గంటల్లో ప్రేమికులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకునేందుకు గోవా వెళ్లిన పెళ్లి కూతురు సమంత నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు అలానే సమాధానాలూ ఇచ్చారు. నెటిజన్లు శామ్‌ను ఏమడిగారో చూడండి..
ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను కూడా నా చెయ్‌ను త్వరలో కలవాలనుకుంటున్నాను. నా కోసం మీరేం చేస్తారు?
నీ చెయ్‌ను నువ్వు త్వరగా మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
చెయ్ మీ స్పెషల్ పర్సన్ అని ఎలా తెలిసింది?
తొలిచూపులోనే..
మీ బేబీకి గౌతమ్ మీనన్ అని పేరు పెడతారా?
నవ్వు
పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారా?
నేను అసలు ఆపలేదు.
మీ పెళ్లి వీడియోను మాతో పంచుకుంటారా?
కచ్చితంగా షేర్ చేస్తాను.
మీరు ప్రస్తుతం ఎలా ఉన్నారు?
కొంచెం భయంగా, ఎక్సైటింగ్‌గా ఉంది.
చెయ్‌కు నేను తనను ప్రేమిస్తున్నానని చెప్పండి
అలానే చెప్తాను.
నాగ చైతన్య ఏమైనా ఇబ్బందిపెడితే చెప్పు శామ్ మన 'శామ్ ఆర్మీ' మొత్తం వస్తుంది
సో క్యూట్..
తొలి చూపులోనే ప్రేమ.. కరెక్ట్ లేదా రాంగ్?
ఆ సమయంలో మీకే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment