చై... మస్కతి.. వర్క్.. ఇవి లేకుండా ఉండలేను!
‘‘నాకింకా చాలా జీవితం ఉంది. ఇవాళ సాధించినది రేపటికి సాదా సీదా అయిపోతుంది. రేపు వేరే సాధించాలి. నాకు చాలా లక్ష్యాలున్నాయి’’ అని సమంత అన్నారు. ఈ బ్యూటీకి బోల్డంత మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అభిమానులందర్నీ సరదాగా పలకరించాలనుకున్నారామె. ‘రండి.. చాట్ చేద్దాం’ అని ఆహ్వానించారు. ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు సమంత. వాటిలో కొన్ని...
ఉదయం నిద్ర లేవగానే ఏం చేస్తారు?
నిద్ర లేవగానే ఫోన్ చూడకూడదనుకుంటాను. అలా చేయడం నాకు అసహ్యం. అయినా ఆ అలవాటు మానుకోలేను. లేవగానే ఫోన్ చెక్ చేస్తా.
మీకేదైనా ఫోబియా ఉందా?
నీళ్లంటే భయం. సూర్యుడన్నా కూడా.
ఫిట్‌నెస్ మంత్ర చెబుతారా?
ఈట్, లవ్, వర్క్, వర్కవుట్స్.
మీ ఫేవరెట్ హాలిడే స్పాట్స్?
లండన్, గోవా.
ఏమేం లేకపోతే మీరు బతకలేరు?
చై (నాగచైతన్య), మస్కతి ఐస్‌క్రీమ్, వర్క్.
మీ అభిమానుల్లో మీకు నచ్చేది?
విశ్వాసం అంటే ఏంటో నేర్పించారు.
మిమ్మల్ని సంతోషపెట్టే విషయం?
నేను తీసుకునే నిర్ణయాలు.
ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో మీకు నచ్చేది?
‘ఏ మాయ చేశావె’. దానికి ప్రత్యేక కారణాలున్నాయి.
కెరీర్‌వైజ్‌గా మీరు అందుకున్న బెస్ట్ సలహా?
ప్రతి సినిమాని మొదటి సినిమాలానే భావించాలని మహేశ్‌బాబు అంటారు.
ఆర్టిస్టులు కావాలనుకునేవాళ్లకు మీరిచ్చే సలహా?
అదృష్టం, విధి రెండూ ఫేవర్ చేయాలి. ఒకవేళ అనుకున్నట్లుగా వర్కవుట్ కాకపోతే బాధపడొద్దు.
‘చై’నే ఎందుకు? నన్నెందుకు ప్రేమించకూడదు?
ఎందుకంటే నిన్ను ఎనిమిదేళ్ల క్రితం కలవలేదు కాబట్టి.. నీకు నేను బెస్ట్ ఫ్రెండ్‌ని కాలేదు కాబట్టి.
మీ ఫ్రిడ్జ్ డోర్‌ని నేను ఓపెన్ చేస్తే.. నాకేమేం కనిపిస్తాయి?
బాదం పాలు, బ్లూ బెరీస్, మస్కతి ఐస్‌క్రీమ్ (అన్ని ఫ్లేవర్లు), పుచ్చకాయ (ఇది మాత్రం నాది కాదు).
మీరు అందుకున్న బెస్ట్ గిఫ్ట్?
‘ది గిఫ్ట్ ఆఫ్ లవ్’.
దేవుడు తర్వాత మీరు నమ్మేది?
ఫ్యామిలీ.