జీ20 సదస్సు కోసం దేశాధినేతలంతా ఢిల్లీకి తరలి వచ్చారు. సదస్సు కూడా జయపద్రంగా జరిగింది కూడా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన నాయకులకు అదిరిపోయే ఆతిధ్యం ఇచ్చింది భారత్. సెప్టెంబర్ 9న మల్టీ ఫంకన్ హాల్ ప్రగతి మైదాన్‌లో ఆల్ వెజిటేరియన్ మెనుతో కూడిన వివిధ వైరైటితో ఆహో అనిపించేలా విందు ఇచ్చింది. ఈ ఈవెంట్‌లో కీలకమైన వంటకంగా మిల్లెట్ ఉంది.
ఎందుకంటే ఐక్యరాజ్యసమితి తన 75వ సెషన్‌లో అంతర్జాతీయి మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన ఫలితంగా వాటితో తయారు చేసిన వంటకాలు ప్రధాన భాగంగా ఉన్నాయి. ఈ మెనూలో మాంసాహారం కూడా ఉంటుంది. ప్రముఖ చెఫ్‌లు సుమారు 120 మంది తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని వెలికితీసి మరీ అతిరథమహారంథులందరికి మన భారతీయ వంటకాలను రుచి చూపించారు. ఇక ఈ మెనూలో ఉండే వంటకాలు.. గుడ్ ఔర్ అమరాంత్ కే లడ్డూ, మామిడి ట్రఫుల్, కాజు పిస్తా రోల్, రాగి బాదం పిన్ని, బలజ్రే కి బర్ఫీ, రాగి పనియారం, కాకుమ్ మాత్రి (చిడియా దానా), నిగెల్లా కన్నోలి, బజ్రే కి ఖీర్, మేక చీజ్ రావియోలీ, భాపా డోయి, కాజు మటర్ మఖానా, లాంబ్ అండ్ మిల్లెట్ సూప్, ముర్గ్-బాదం-అమరాంత్ కోర్మా, మిల్లెట్ నర్గీసి కోఫ్తా, ఆరెంజ్-క్వినోవా-మిల్లెట్ ఖీర్, అవోకాడో సలాడ్ తదితర రకాల వంటకాలతో అత్యంత వైభోవోపేతంగా ఆతిథ్యం ఇచ్చారు.
ఈ వంటకాలను పర్యవేక్షించే వారిలో తాజ్ ప్యాలెస్‌కు చెందిన చెఫ్ సురేంద్ర నేగి కూడా ఉన్నారు. గత మూడు నెలలుగా వంటకాలను ప్రతీరోజు పరీక్షించడం తోపాటు మెనులో దేశం మొత్తం కవర్ అయ్యేలా ఆయా ప్రాంతాల వివిధ రుచులను అందించేందుకు ప్రయత్నం చేసినట్లు వివరించారు. కాగా, భారతదేశం తమకు అపూర్వమైన ఆతిథ్యం ఇచ్చిందని దేశధినేతలు ప్రశంసించారు. ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అంటూ భారత్ ఇస్తున్న సందేశాన్ని వారంతా ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమను ఒకే వేదికపై తీసుకొచ్చిన మోదీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక మోదీ కూడా జీ20 సదస్సు ముగిసినట్లు పేర్కొన్నారు.
(చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..)
Comments
Please login to add a commentAdd a comment