రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..
ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం.
గరడు చాట్ అంటే..?
కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్‌లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్‌లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్‌లో మరింత గ్రాండ్‌గా వివాహ మెనూ ఉండొచ్చు.
(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్..!)
Comments
Please login to add a commentAdd a comment