అనంత్‌ రాధికల పెళ్లిలో లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా.. | Lalita Dsilva Once Cared For Anant Ambani Shares Pics From His Childhood | Sakshi
Sakshi News home page

అనంత్‌ రాధికల పెళ్లిలో సందడి చేసిన లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..

Published Wed, Jul 17 2024 1:30 PM | Last Updated on Wed, Jul 17 2024 1:32 PM

Lalita Dsilva Once Cared For Anant Ambani Shares Pics From His Childhood

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్‌-రాధికల వివాహ వేడుకులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎందరో ప్రుముఖులు, బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ తారలు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు విచ్చేశారు. ఈ వేడుకలో కేవలం సెలబ్రెటీలు, సినీ ప్రముఖులకు మాత్రమే గాదు తమ కుటుంబానికి సేవ చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పిలచింది అంబానీ కుటుంబం. అనంత్‌ రాధికల వివాహంలో బాగా హైలెట్‌గా నిలిచింది లలితా డిసిల్వా. అనంత్‌ పెళ్లికి వచ్చిన వారంలా ఈ లలితా డిసిల్వా గురించి మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఆ వివాహంలో ఆమెనే హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

లలితా డిసిల్వా కరీనా కపూర్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ల కుమారులు తైమూర్‌, జెహ్‌ల సంరక్షణ చూచుకునే నానీ. ఆమె అనంత్‌ పెళ్లిలో సందడి చేయడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే..? ఆమె ఒకప్పుడూ అనంత్‌ బాల్యంలో అతడి సంరక్షణ బాధ్యతలు చూసుకున్న నానీనే లలితా డిసిల్వా. ఇన్నేళ్లు గడిచిపోయినా..అంబానీ కుటుంబం తనను గుర్తించుకుని మరీ ఇలా అనంత్‌ రాధికల పెళ్లికి పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ నాడు అనంత్ బాధ్యతలను చూసుకున్న ఫోటోలను కూడా షేర్‌ చేశారు. 

 

అనంత్‌ బాబు, అంబానీ కుటుంబం తన జీవితంలోకి తెచ్చిన ఆనందం, ప్రేమలను ఎన్నటికీ మర్చిపోలేను. అతను చాలామంచి అబ్బాయి అని అన్నారు. అతను ఈ గొప్ప వేడుకతో సంతోషకరమైన వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న అనంత్‌కి శుభాకాంక్షలు అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దేవుడు ఈ జంటను తప్పక ఆశీర్వదిస్తారు అని అన్నారు. ఆమె ఇప్పుడూ టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ ఉపాసనల కుమార్తె క్లిన్‌ కారాకు నానీ కూడా. ఆమె ఈ నేపథ్యంలో తాను పనిచేసిన సెలబ్రెటీ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలను సైతం షేర్‌ చేసింది.

(చదవండి: 'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్‌..?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement