
అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యలు ధరించిన నగలు, ఫ్యాషన్ బ్రాండ్ డ్రస్‌లపైన తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మేడుకలు బాలీవుడ్ అగ్ర తారలు, ప్రముఖ పాప్ సింగర్‌లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు.
అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ధరించిన డ్రస్‌లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్ అంబానీ రేంజ్‌కి తగ్గట్టు ఆమె డ్రస్‌లు నగలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అది కామనే.
కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్‌లో డ్రస్‌లు డిజైన్ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ చివరి రోజున రాదిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్‌పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్‌ర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట. అంతేగాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధువరులు అనంత్ రాధికాలు తమ వివాహపత్రాలపై సంతాకాలు చేసినట్లు వోగ్ మీడియా పేర్కొంది.
(చదవండి: వజ్రాలు వైఢ్యూర్యాల డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment