400 ఫిలిగ్రీ వస్తువులకు
ఆర్డర్ ఇచ్చిన కుబేరుల కుటుంబం
విద్యానగర్ (కరీంనగర్): ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళానైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆర్థిక కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్–రాధిక వివాహ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్దస్టార్స్ కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యే వీవీఐపీలకు విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ కుటుంబం నిర్ణయించింది. వాటిలో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కూడా ఉన్నాయి.
ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచి్చనట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతర త్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం 400 సంవత్సరాల నాటి పురాతన కళకు ప్రోత్సాహకంగా నిలు స్తుందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో జీఐ ట్యాగ్ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయా రు చేయడం, తీగలు అల్లడం ఈ కళ విశేషం.
Comments
Please login to add a commentAdd a comment