
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్(Nikhil Kamath)) అవిసే గింజలు, మఖానాలను ఇష్టంగా తింటానని ఒక ఇంటర్యూలో అన్నారు. భారతదేశంలో తదుపరి సూపర్ ఫుడ్(superfood) మఖానాలేనని కూడా చెప్పారు. ఆరోగ్య స్ప్రుహ ఉన్న ఈ ఆధునిక కాలంలో కచ్చితంగా గొప్ప ఆరోగ్య ఆహార బ్రాండ్‌గా అవతరిస్తుందని అన్నారు. ఇది డయాబెటిస్, కొలస్ట్రాల్, రక్తపోటు సమస్యలను అద్భుతంగా అదుపులో ఉంచుతుందని చెప్పారు. ఇది నిజంగానే దీర్ఘకాలిక వ్యాధుల(chronic illnesses)ను నివారించడంలో సహాయపడుతుందా అంటే..
పోషకాల ప్రొఫైల్..
మఖానా(Makhana)లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో 9 శాతం ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. సహజంగా లభించే సోడియం చాలా తక్కువ సాంద్రతలను కలిగి ఉంటుంది.
దీనిలో కొద్దిపాటి కొవ్వు మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్(MufA) రూపంలో ఉంటుంది. పైగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెరను నిర్వహించడానికి, శరీర కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందట. మఖానాలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు కేన్సర్ నిరోధక లక్షణాలను పెంచుతుందట. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ఎంజైమ్‌లు మూత్రపిండాలు శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుందట. పెద్దలకు 25-30 గ్రాములు, పిల్లలకు 10-20 గ్రాములు చొప్పున తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దీన్ని స్మూతీలు, కూరలు, స్నాక్‌ల రూపంలో తీసుకోవచ్చు. అయితే పాలతో మరింత పోషక విలువలను అందిస్తుందట. అలాగే ఇక్కడ తినమగానే.. ప్యాకింగ్ చేసిన రోస్ట్ మఖానాలు మాత్రం తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇవి ప్రయోజనాల కంటే అనారోగ్యకరమైన ప్రమాదాలనే ఎక్కువగా అందిస్తుందని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment