
సింగపూర్: సింగపూర్ మినిస్టర్ ఒకరు తప్పులో కాలేశారు. కాటన్ ఉత్పత్తికి తగినన్ని గొర్రెలు లేవంటూ నవ్వుల పాలయ్యారు. అది కూడా ఓ వీడియో ఇంటర్వ్యూలో. ఇంకేముంది జనాలు సదరు మినిస్టర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వివరాలు.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి చాన్ చున్ సింగ్ ఓ వీడియో ఇంటర్వ్యూలో విదేశీ వాణిజ్యం మీద సింగపూర్ ఎలా ఆధారపడిందో వివరిస్తూ.. ‘ఫేస్ మాస్క్‌లు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. కానీ వాటి తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదు. కాటన్‌ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్‌లో లేవు’ అన్నారు. తర్వాత తన పొరపాటును గ్రహించి తనలో తానే నవ్వుకున్నారు చాన్. కానీ ఈ లోపే నెటిజనులు ఆయనను ఓ ఆట ఆడుకున్నారు.
‘బాబా బ్లాక్ షీప్ రైం గుర్తు పెట్టుకుంటే సరి’.. ‘ఈ వీడియో చేసే వారేవరైనా.. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం కాటన్, పత్తి చెట్ల నుంచి వస్తుంది కానీ గొర్రెల నుంచి రాదని చెప్పగలరు’.. ‘నేను గొర్రెలను లెక్కిస్తున్నాను’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. అయితే చాన్ ఇలా నోరు జారడం ఇదే ప్రథమం కాదు. గతంలో లాక్‌డౌన్ నేపథ్యంలో మాల్స్ ముందు క్యూ కట్టిన జనాలను ఉద్దేశిస్తూ.. ‘ఇడియట్స్’ అని కామెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment