పత్తి రైతు ఢమాల్
గణయంగా తగ్గిన దిగుబడి
► రెండుసార్లకే చేన్లు లూటీ
► భారంగా మారిన పెట్టుబడి
► కొంపముంచిన అధిక వర్షాలు
► చేన్లు చెడకొట్టి మక్క వేస్తున్న రైతులు
వీణవంక : గత రెండేళ్లుగా కరువుతో విలవిలలాడిన పత్తి రైతుకు ఈసారి కూడా కాలం కలిసిరాలేదు. వాతావారణ పరిస్థితులు అనుకూలించకపోవడం పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. మొదట్లో వానల్లేక పంట ఎండిపోగా.. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన కుండపోత వర్షాలతో పత్తిచేలు దెబ్బతిన్నారుు. నీళ్లు నిలిచి మొక్కలు చేలు జాలువారగా, మొక్కలు ఎరబ్రారిపోయారుు. వివిధ రకాల తెగుళ్లు సోకి పంటంతా దెబ్బతిన్నది. చేను పూత దశలో ఉన్న సమయంలో ఎడతెరిపిలేని వర్షాలతో పత్తి పాడరుుంది. పదిహేను రోజులపాటు వర్షాలు పడడంతో వేరుకుళ్లు సోకింది. జిల్లాలో 15వేల ఎకరాలలో ఈ తెగుళ్ల ప్రభావం ఉంది. దీంతో ఆరుసార్లు ఏరుదామనుకున్న చేను రెండుసార్లకే లూటీ పోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కొందరు పత్తి చేన్లను చెడగొట్టి రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 65వేల హెక్టార్లలో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా 54,557 హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చింది. ఎకరాకు 13 క్వింటాళ్ల చొప్పున జిల్లావ్యాప్తంగా ఏడు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాల ప్రభావంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు కనీసం ఆరు క్వింటాళ్ల పత్తి సైతం వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆశలు వదులుకున్న రైతులు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 12వేల ఎకరాల్లో పత్తి చేన్లు చెడగొట్టి మక్కసాగు చేశారు.
కౌలు రైతులకు కష్టాలే..
మొదట్లో చేను ఏపుగా పెరగడంతో అప్పు తెచ్చి రైతులు ఎకరాకు రూ.30వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. కనీసం 13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా... ఆరు క్వింటాళ్లు సైతం వచ్చేలా లేదు. ఆరు క్వింటాళ్ల పత్తి అమ్మితే మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రూ.25-30 వే లు చేతికొస్తున్నారుు. దీంతో పెట్టుబడి చేతి నుంచి పెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలుపుకొని ఎకరాకు రూ.20-25 వేల చొప్పున భూ యజమానికి ముందుగానే కౌలు చెల్లించారు. కౌలు, పెట్టుబడి కలిపి ఎకరానికి రూ.50వేల దాకా పెట్టుబడి పెట్టారు. పత్తి దిగుబడి గణనీయంగా తగ్గడంతో కౌలురైతులకు పెట్టుబడులు మీద పడే పరిస్థితి వచ్చింది.