నందవరంలో విషాదం | tragedy in nandavaram | Sakshi
Sakshi News home page

నందవరంలో విషాదం

Published Wed, Sep 20 2017 1:10 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

నందవరంలో విషాదం - Sakshi

నందవరంలో విషాదం

- పొలానికి మందు పిచికారీ చేసేందుకెళ్లి అస్వస్థతకు గురైన భార్యా భర్తలు
- చికిత్స పొందుతూ భార్య మృతి
- భర్త పరిస్థితి విషమం
 
నందవరం :  నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేయడానికి వెళ్లిన భార్యాభర్త  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి మ​ృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మండలకేంద్ర నందవరంలోని చాకలి గేరిలో నివసించే వీరాంజినేయులు, ఆదెమ్మ భార్య,భర్తలు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. పత్తి పంటకు పురుగుల మందు  పిచికారీ చేయడానికి మంగళవారం వారు పొలానికి వెళ్లారు. పంటకు పిచికారీ చేసి సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చారు. భార్య,భర్తలిద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆదెమ్మ (24) తుది శ్వాస విడిచింది. భర్త వీరాంజినేయులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement