తగ్గిన పత్తి ధర
ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధర క్వింటాలుపై దాదాపు రూ.600 వరకు తగ్గింది. పండుగకు ముందు రోజు శనివారం కింటాలు రూ.6600 వరకు పలుకగా మూడు రోజుల సెలవుల తరువాత ధర తగ్గడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే గురువారం.. యార్డుకు 4398 క్వింటాళ్ల పత్తి మాత్రం తెచ్చారు. టెండర్లు కూడా చాలా ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. గందరగోళం పరిస్థితుల మధ్య క్వింటాలు రూ.4000 నుంచి 5998 వరకు మాత్రం పలికినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం నుంచి యార్డులో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని ధర కూడా పెరుగవచ్చని భావిస్తున్నారు.